వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి అంతా సిద్దం.. నిర్వహణ కమిటీలు, కన్వీనర్లు వీరే..
వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి మూడో ప్లీనరీ ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి ప్లీనరీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అమరావతి : ఈనెల 8,9 తేదీల్లో వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈ ప్లీనరీ నిర్వహించనున్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ ఆవిర్బావం తరువాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ కూడా ఇదే.
ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు మరింత దగ్గరవ్వడం.. ప్రజల అభివృద్దికి పాటు పడడమే ప్రధాన అజండాగా ఈ ప్లీనరీ సమావేశాలు జరగున్నాయి. వైసీపీ పార్టీ ఏర్పాటయ్యాక 2011లో మొదటి ప్లీనరీ ఇడుపుల పాయలో నిర్వహించారు. అధికారంలోకి రావడం.. వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నాం... అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏం చేశాం.. మిగిలిన రెండేళ్లలో ఏం చేయాలి అనేది ముఖ్యంగా చర్చించనున్నారు.
దీనికి సంబంధించి.. ప్లీనరీ నిర్వహణకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్లను ఎంపిక చేశారు. ఆ వివరాలు ఇవే..
1. ప్లీనరీ నిర్వహణ కమిటీ - బొత్స సత్యనారాయణ
2. ఆహ్వన కమిటీ - వైవీ సుబ్బారెడ్డి
3. ప్రజా ప్రతినిధుల సమన్వయం - సజ్జల రామకృష్ణారెడ్డి
4. వేదిక, ప్రాంగణం నిర్వహణ - తలశిల రఘురాం
5. సభా నిర్వహణ కమిటీ - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
6. స్టేజ్ ప్రోటోకాల్ - తానేటి వనిత
7. అలంకరణ కమిటీ - వెల్లంపల్లి శ్రీనివాస్
8. వసతి ఏర్పాట్ల కమిటీ - కొలుసు పార్థసారధి
9. తీర్మాణాల కమిటి - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
10. ప్రతినిధులు, పాస్‌లు - గుడివాడ అమర్నాథ్
11. భోజన వసతుల కమిటీ - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
12. పార్టీ అధ్యక్ష ఎన్నికల కమిటీ - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
13. పార్టీ రాజ్యాంగ సవరణల కమిటీ - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
14. మీడియా, ఫోటో ఎగ్జిబిషన్ కమిటీ - పేర్ని నాని
15. హెల్త్ కమిటీ - డాక్టర్ సీదిరి అప్పలరాజు
16. కల్చరల్ కమిటీ - వంగపండు ఉష
17. వాలంటీర్స్ కమిటీ - గడికోట శ్రీకాంత్ రెడ్డి
18. రవాణా కమిటీ - చిన్నశ్రీను
19. ఆడిటోరియం నిర్వహణ కమిటీ - లేళ్ల అప్పిరెడ్డి