వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తాం: పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన వైసీపీ నేతలు

గుంటూరు జిల్లాలో నిర్వహించనున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఏర్పాట్లను ఆ పార్టీ ముఖ్య నేతలు బుధవారం ఉదయం  పరిశీలించారు. అనంతర వారు మీడియాతో మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్ జన్మదినమైన జూలై 8వ తేదీ తమకు పవిత్రమైన రోజు అని చెప్పారు. జూలై 8,9 తేదీల్లో వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీని నిర్వహించుకుంటున్నామని చెప్పారు.
 

YSRcp leaders press meet after inspecting party state level plenary arrangement

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగరాజున యూనివర్సిటీ ఎదుట నిర్వహించనున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఏర్పాట్లను ఆ పార్టీ ముఖ్య నేతలు బుధవారం ఉదయం  పరిశీలించారు. అనంతర వారు మీడియాతో మాట్లాడుతూ.. 2017లో ఇదే ప్రాంతంలో ప్లీనరీలో నిర్వహించుకన్నామని గుర్తుచేశారు. జూలై 8,9 తేదీల్లో వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వైసీసీ అధినేత, సీఎం జగన్ చెప్పినట్టుగా 2024 ఎన్నికల్లో 175‌కు 175 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి నుంచి సమావేశాలకు అందరూ నేతలు హాజరవుతారని చెప్పారు. 

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఒకే సిద్దాంతంతో తమ పార్టీ నాయకుల అందరం పనిచేస్తున్నామని చెప్పారు. తమ ప్లీనరీ సమావేశాలు మిగతా వాటికంటే భిన్నంగా ఉంటాయని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి సమావేశాలకు అందరూ నేతలు సమావేశాలకు హాజరుకానున్నట్టుగా తెలిపారు. జూలై 8వ తేదీన వైఎస్ జగన్ ప్రారంభోపన్యాసంతో సమావేశాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ప్లీనరీలో పలు తీర్మానాలను ఆమోదించనున్నట్టుగా చెప్పారు. 9వ తేదీ సాయంత్రం వైఎస్ జగన్ సందేశంతో ప్లీనరీ సమావేశాలు ముగుస్తాయని తెలిపారు. కిక్ బాబు ఔట్ నినాదంతో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం సాధించి.. 2027లో మళ్లీ ప్లీనరీలో నిర్వహించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును ఈ ప్లీనరీలో ఆవిష్కరిస్తామని చెప్పారు. తమది కేవలం పార్టీ ప్లీనరీ కాదని.. ప్రజల అజెండా అని తెలిపారు. ఆరోజు నవరత్నాల ఎజెండా ఇక్కడి నుంచే వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు. దివంగత వైఎస్సార్ జన్మదినమైన జూలై 8వ తేదీ తమకు పవిత్రమైన రోజు అని చెప్పారు. క్షేత్ర స్థాయిలో నాయకులు కూడా జగన్ సంతకంతో కూడిన లేఖ ద్వారా ఆహ్వానం అందజేయనున్నారని తెలిపారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios