చంద్రబాబు తిరుపతి సభకు పోటీగా వైసిపి వంచన దినం

చంద్రబాబు తిరుపతి సభకు పోటీగా వైసిపి వంచన దినం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ దీక్షలు జరగనున్నాయి. కేంద్రం అన్యాయం చేసిందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు తిరుపతిలో సోమవారం ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు. దానికి పోటీగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వంచన దినంగా పాటిస్తోంది.

విశాఖపట్నంలో వంచన దినంగా పాటిస్తూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో వైసిపి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొంటున్నారు. 24 సార్లు చంద్రబాబు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించడానికి వైసిపిసిద్ధపడింది. 12 గంటల పాటు ఈ దీక్ష సాగుతుంది. నల్లబ్యాడ్జీలు ధరించి దీక్ష చేస్తారు. వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా నల్లబ్యాడ్జీ ధరించి ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొంటారు.

తిరుపతిలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని, వెంకన్న దర్శనార్థం దీక్షకు దిగుతారు. రాత్రి ఏడు గంటల వరకు ఈ దీక్ష సాగుతుంది. 

ధర్మపోరాట దీక్షకు లక్ష మంది పాల్గొంటారని భావిస్తున్నారు. తన ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇస్తారని అంటున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీకి సంబంధించి ఆ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుంది.

ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను తిరుపతి సభ వేదికగా చంద్రబాబు ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ధర్మ పోరాట దీక్ష సందర్భంగా తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభకు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. 

చంద్రబాబు తిరుపతిలో ధర్మ పోరాట దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 420 దీక్షలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు చేసిందంతా చేసి ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా ఏమీ రాదని చంద్రబాబు అనలేదా అని ఆయన ప్రశ్నించారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page