కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసిపి ఎంపిలు రాజీనామలు చేస్తున్నారు. కేంద్రంపై తమ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టనందుకు నిరసనగా ఎంపిలు రాజీనామాలు చేయనున్నారు. తమ రాజీనామా లేఖలను సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపట్లో స్పీకర్ సుమిత్రా మహాజన్ కు కలిసి లేఖలను అందచేయాలని నిర్ణయించారు. ఎందుకంటే, బుధవారం గనుక లోక్ సభ జరగకపోతే సమావేశాలను నివదికంగా వాయిదా వేసేందుకే అవకాశాలున్నాయి. ఆ విషయాన్ని స్పీకర్ ప్రకటించగానే రాజీనామాలు ఇచ్చేయాలని అందరు ఎంపిలు నిర్ణయించారు.