పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి.
పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. మార్చి 5వ తేదీన మొదలైన రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఒక్క రోజు కూడా సక్రమంగా జరగలేదు. ప్రతీరోజూ ఏఐఏడిఎంకె, టిఎంసి, టిఆర్ఎస్ సభ్యులు ఏదో ఒక కారణంతో సమావేశాలు జరగకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసిపి, టిడిపిలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై కూడా చర్చ జరగలేదు.
తర్వాత టిఎంసి, టిఆర్ఎస్ సభ్యులు శాంతిచి తమ ఆందోళనలను విరమించిని కావేరి ట్రైబ్యునల్ ఏర్పాటు డిమాండ్ తో ఏఐఏడిఎంకె సభ్యులు మాత్రం ప్రతీ రోజూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దాంతో సభలో అవిశ్వాస తీర్మానాలపై ఒక్కరోజు కూడా చర్చకు అవకాశం రాలేదు.
సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన వెంటనే తమ సభ్యులు రాజీనామాలు చేస్తారన్న జగన్ ప్రకటనమేరకు ఐదుమంది వైసిపి లోక్ సభ ఎంపిలు రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలుస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అపాయిట్మెంట్ అడిగారు.
