రాజీనామాలు చేసిన వైసిపి ఎంపిలు

First Published 6, Apr 2018, 11:57 AM IST
Ycp mps submitted their resignations to Lok Sabha speaker
Highlights
తమ రాజీనామా లేఖలను స్పీకర్ సుమిత్ర మహాజన్ కు అందచేశారు.

ఐదుగురు వైసిపి ఎంపిలు శుక్రవారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను స్పీకర్ సుమిత్ర మహాజన్ కు అందచేశారు. ఏపికి కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తారన్న అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట మేరకు ఎంపిలు ఈరోజు రాజీనామాలు చేశారు.

పార్లమెంటు నుండి ఎంపిలందరూ ఏపి భవన్ కు వెళ్ళి ప్రత్యేకహోదా డిమాండ్ పైనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. అందుకు ఏపి భవన్లో అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రాష్ట్రంలోని కీలక నేతలందరూ ఎంపిలకు సంఘీభావంగా ఏపి భవన్ కు చేరుకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలోనూ ఆందోళనలు, నిరసనలతో కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రం  హోరెత్తిపోతోంది.

loader