‘ఏపీలో వైసీపీ ఎంపీలే హీరోలు’

YCP mps are real heros
Highlights


హోదా కోసం రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు

ఇప్పుడు ఏపీలో వైసీపీ ఎంపీలే హీరోలని కేఆర్‌పీఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి  ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ.. వైసీపీ ఎంపీలు ఏప్రిల్ నెలలో తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వారి రాజీనామాలను ఇటీవల పార్లమెంట్  స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించారు. ఆ ఎంపీ స్థానాలకు ఉప ఎన్నిక ఉంటుందా..? ఉండదా అనే విషయంపై ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు.

కాగా.. ఈ విషయంపై కేఆర్ పీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ కలిమిలి రాం ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎంపీలు  రాజీనామాలు చేసీ ప్రజల్లో హీరోలయ్యారన్నారు. అధికార పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే కచ్చితంగా రాష్ట్రానికి హోదా వచ్చి ఉండేదని ఆయన అన్నారు.  

loader