Asianet News TeluguAsianet News Telugu

"మోడీకి జనతా కర్ఫ్యూ ఐడియా ఇచ్చింది చంద్రబాబే".....విజయసాయిరెడ్డి

ప్రతిపక్ష టీడీపీ మీద ఆరోపణలు గుప్పించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండే వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్ర బౌ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. 

YCP MP Vijayasai Reddy fires on Chandrababu Naidu
Author
Amaravathi, First Published Mar 23, 2020, 1:29 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎల్లప్పుడూ హాట్ హాట్ గానే ఉంటున్నాయి. కరోనా కరాళ నృత్యం చేస్తున్నప్పటికీ... ఆ కరోనా వైరస్ ని కూడా పక్కవారి మీద సెటైర్లు వేయడానికి రాజకీయ పంచ్ లు విసరడానికి వాడుతున్నారు. 

ప్రతిపక్ష టీడీపీ మీద ఆరోపణలు గుప్పించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండే వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్ర బౌ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. 

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటుగా యెల్లో వైరస్ వ్యాప్తిని కూడా అడ్డుకోవాలని పంచ్ లు విసిరాడు విజయసాయి రెడ్డి. "కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి. ఎల్లో మీడియా ‘తుమ్ములు, దగ్గులతో’ పచ్చ వైరస్ ను వదులుతూనే ఉంది. అధికార పీఠం నుంచి తరిమివేసినా చంద్రబాబు బ్యాచ్ తమ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోంది. తస్మాత్ జాగ్రత్త!" అని ఒక ట్వీట్లో పంచ్ వేశారు. 

ఇక మరొక ట్వీట్లో రాష్ట్రప్రజలు జగన్ ని ఎన్నుకొని మంచిపని చేసారంటూ చంద్రబాబు అయితే ఎం చేసేవాడో అంటూ ఆరోపణలు గుప్పించారు. "అత్యంత బాధ్యతతో వ్యవహరించే జగన్ గారి పాలనలో ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సంతోషించాలి. అనుభవజ్ఞుడు అని చెప్పుకునే వ్యక్తిని తరిమేసి ఉండకపోతే ఇవాళ కరోనా నియంత్రణ కంటే తన ప్రచారం ఎక్కువగా ఉండేది. జాగ్రత్తల పేరుతో వాణిజ్య ప్రకటనలు జారీ చేసి పచ్చమీడియాకు వేల కోట్లు దోచి పెట్టేవాడు." అని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఇక వేరొక ట్వీట్లో జనతా కర్ఫ్యూ ఐడియా బాబుదే అంటూ... చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. "పవర్ పోయిన దిగులులో ఉన్నాడు కానీ లేకపోతే జనతా కర్ఫ్యూ ఐడియా ప్రధానికిచ్చింది తనేనని బొంకేవాడు. చైనా ప్రెసిడెంట్ కూ ధైర్యం చెప్పిన బాబు అంటూ ఎల్లో మీడియా రోజంతా దంచేది. వీడియో కాన్ఫరెన్సులతో అధికారులను ఏడిపించేవాడు. నిధులు నాకేందుకు రకరకాల స్కీమ్స్ మొదలయ్యేవి." అని మీడియాపై కూడా ఆరోపణలు చేసారు. 

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎంతలా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ... రాజకీయంగా ఉండాల్సిన పొలిటికల్ హీట్ మాత్రం అలానే సజీవంగా ఉండడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios