చంద్రబాబుపై తిరుపతి ఎంపీ వరప్రసాద్ ఆగ్రహం చంద్రబాబు ముస్సోరీ ఎందుకు వెళ్లారంటూ నిలదీసిన వరప్రసాద్

రాష్ట్రంలో ఐఏఎస్ ల వ్యవస్థను నిర్వీర్యం చేసి.. ముస్సోరీకి వెళ్లి చంద్రబాబు ఏమి చేస్తున్నారని వైసీపీ ప్రశ్నించింది. చంద్రబాబు సోమవారం ముస్సోరీలోని ఐఏఎస్ ల శిక్షణా కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన ఐఏఎస్ అధికారుల కోసం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. దీనిపై వైసీపీకి చెందిన తిరుపతి ఎంపి వరప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు.

మన రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థని నీరు గార్చి.. ముస్సోరి కి వెళ్లి వారికి ఏం శిక్షణ ఇస్తారని ప్రశ్నించారు. అసలు ముస్సోరి పర్యటను చంద్రబాబు ఎందుకు వెళ్లారని నిలదీశారు. కలెక్టర్ల వ్యవస్థని నిర్వీర్యం చేసింది చంద్రబాబు కాదా అంటూ మండిపడ్డారు. అధికారాలన్నీ చంద్రబాబు ,.. జన్మ భూమి కమిటీలకు అప్పగించారని ఆరోపించారు. ఓ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహిరస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు చెప్పినట్లు వినాలని అధికారులను భయపెడుతున్నారని మండిపడ్డారు. వ్యవస్థలు నీరుగార్చిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు.