కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేమంది రాజకీయనేతలు దీని బారిన పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా పాజిటివ్ గా తేలారు.

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్ల శ్రీదేవికి కరోనా సోకింది. ఆమె హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స తీసుకుంటున్నారు. 

స్వయంగా డాక్టర్ కూడా అయిన ఉండవల్లి శ్రీదేవి తనకు సోకిన కరోనా విషయంలో అశ్రద్ధ చేశారు. తగిన సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం, నిర్లక్ష్యం వల్ల ఊపిరితిత్తుల సమస్య తీవ్రమయింది. 

దీంతో డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని ఆస్పత్రిలో చేర్పించారు. శ్రీదేవి ఆరోగ్యం మీద ఏపీ సీఎంవో నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీదేవి అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులను చూస్తే.. ఇక్కడ పరిస్ధితి అదుపు తప్పుతున్నట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌లతో ఏపీ పోటీ పడుతున్నట్లుగా పరిస్ధితి వుంది.

ఏపీలో భయపెడుతున్న కరోనా: కొత్తగా 4,228 కేసులు.. చిత్తూరులో పరిస్ధితి ఆందోళనకరం...

గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,228 మందికి పాజిటివ్‌గా తేలడం అధికార వర్గాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 9,32,892కి చేరింది.

సోమవారం ఒక్కరోజే కోవిడ్ కారణంగా 10 మంది మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,321కి చేరుకుంది. కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, గుంటూరు, కృష్ణ, కర్నూలు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.