కియో మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీలో త్వరలో చీలిక రాబోతుందని.. అ ఆందోళన చంద్రబాబు లో స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆయన ఆరోపించారు.

పార్టీ చిలిపోతుందనే ఆందోళనతో ఏమి మాట్లాడుతున్నారో చంద్రబాబు కు అర్ధం కావడంలేదంటూ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్లో మీడియా కూడా చంద్రబాబు మోసి మోసి అలిసిపోయిందని.. చంద్రబాబు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.

Also Read:కియో కోసం ఎంతో కష్టపడ్డా.. షిఫ్టింగ్ వార్త బాధ కలిగించింది: చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి చంద్రబాబుకు లేదని.. పోలీసులు మీద ఆధారపడి జీవించేది చంద్రబాబేనని, జడ్ ప్లస్ భద్రత లేకుండా జనాల్లోకి ఆయన వెళ్లగలరా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

వికేంద్రీకరణ ఎందుకు వద్దో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కీయా పోతుందని చంద్రబాబు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని.. తాను చెప్పినట్లు రాసే పత్రికలు ఉన్నాయని ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని.. చంద్రబాబు బతుకు గ్రాఫిక్ బతుకని ఆయన ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులు చూడలేక చంద్రబాబు బురద జల్లుతున్నారని.. రాష్ట్రము నుంచి ఏ పరిశ్రమ వెళ్లదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read:రద్ధులు, కూల్చివేతలు, తరలింపులకు ఫలితం ఇదే: కియా తరలిపోవడంపై పవన్ వ్యాఖ్యలు

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కట్టిన గొల్లపల్లి ప్రాజెక్టు వలనే కియా పరిశ్రమ అనంతపురంకు వచ్చిందని ఆయన గుర్తుచేశారు. కియాపై చంద్రబాబు తప్పుడు కథనాలు రాయించారని.. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి కానీ పోయేవీ ఉండవని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.