Asianet News TeluguAsianet News Telugu

డేరా బాబాకు గురువే చంద్రబాబు...

  • మొత్తానికి డేరా సచ్చా సౌదా మన రాష్ట్ర రాజకీయాల్లో ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిపోతోంది.
  • టిడిపి-వైసీపీ నేతలు తాము విమర్శించుకోవటానికి ఇపుడు డేరా బాబాను అడ్డం పెట్టుకుంటున్నారు.
  • సోమవారం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ, ‘అక్కడ డేరా బాబా ఇక్కడ జగన్ బాబా’ అని ఎద్దేవా చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
  • దానికి జవాబుగా మంగళవారం వైసీపీ గుడివాడ ఎంఎల్ఏ కొడాలి నాని మాట్లాడుతూ, ‘డేరా బాబా గురువే చంద్రబాబా’ అంటూ రివర్స్ పంచ్ ఇచ్చారు.
Ycp mla says naidu is the guru of dera baba

మొత్తానికి డేరా సచ్చా సౌదా మన రాష్ట్ర రాజకీయాల్లో ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిపోతోంది. టిడిపి-వైసీపీ నేతలు తాము విమర్శించుకోవటానికి ఇపుడు డేరా బాబాను అడ్డం పెట్టుకుంటున్నారు. సోమవారం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ, ‘అక్కడ డేరా బాబా ఇక్కడ జగన్ బాబా’ అని ఎద్దేవా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి జవాబుగా మంగళవారం వైసీపీ గుడివాడ ఎంఎల్ఏ కొడాలి నాని మాట్లాడుతూ, ‘డేరా బాబా గురువే చంద్రబాబా’ అంటూ రివర్స్ పంచ్ ఇచ్చారు.

మీడియాతో నాని మాట్లాడుతూ, చంద్రబాబుపై ఉన్న కేసులను గనుక సిబిఐ విచారిస్తే జీవితాంతం జైలుల్లోనే ఉండాలంటూ సిఎంపై విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబు నమ్మక ద్రోహి, దొంగ’ అని స్వయంగా ఎన్టీఆరే చెప్పిన విషయాన్ని నాని గుర్తు చేసారు. లేకపోతే దగ్గుబాటిని అడిగినా చెబుతారని కూడా నాని పేర్కొన్నారు.

విశ్వసనీయత, అభివృద్ధి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు వచ్చిన ఉపఎన్నికల్లో ఎన్ని గెలిచారని నిలదీసారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నపుడు జరిగిన 44 అసెంబ్లీ ఉపఎన్నికల్లో 21 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదన్నారు. పది చోట్ల మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన విషయం అందరికీ గుర్తుందన్నారు.

పనిలో పనిగా చంద్రగిరి నియోజకవర్గం గురించి కూడా మాట్లాడారు. ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు టిడిపి ఓడిపోలేదా అంటూ ప్రశ్నించారు.  చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు చంద్రగిరికి జరిగిన నాలుగు ఎన్నికల్లో ఒక్కదానిలో కూడా గెలవలేదు కదా అంటూ ఎద్దేవా చేసారు. ఇంధిరాగాంది, రాజీవ్ గాంధీలతో ఎప్పుడు పోరాటం చేసాడో తెలీదన్నారు. వినేవాళ్ళుంటే బ్రిటీష్ వాళ్ళతో కూడా పోరాడానని చంద్రబాబు సొల్లు చెబుతారంటూ కొడాలి నాని మండిపడ్డారు.

 

మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM

Follow Us:
Download App:
  • android
  • ios