టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, కేటీఆర్‌ల మధ్య జరిగిన సమావేశంపై టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తుండటంతో ఆమె ఫైరయ్యారు. 

జనసేన పార్టీ ఆవిర్భావసభతో పాటు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ను ఎన్నో రకాలుగా విమర్శించిన పవన్ కల్యాణ్ తర్వాత కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కలశారన్నారు. అలాగే మొన్నటి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ కూడా తన స్వప్రయోజనాల కోసం కేసీఆర్ చుట్టూ తిరిగారని ఆమె ఎద్దేవా చేశారు.

అంతకుముందు మంత్రి దేవినేని ఉమాపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ బెజవాడ వచ్చినప్పుడు దేవినేని ఉమా ఆయనకు శాలువా కప్పి, పళ్లు ఇకిలించుకుంటూ దుర్గమ్మ దర్శనం చేయించారని మండిపడ్డారు. ఇదే కేసీఆర్ మంత్రి దేవినేని ఉమనుద్దేశిస్తూ ఆడా, మగా అని వ్యాఖ్యానించారని, అన్ని మరిచిపోయి కేసీఆర్‌ను తీసుకెళ్లి ఉమ అమ్మవారి దర్శనం చేయించలేదా అని ఆమె ప్రశ్నించారు.

ప్రొటోకాల్ ప్రకారమే కేసీఆర్‌ను కలిశా: రోజాకు దేవినేని ఉమా రిప్లై