Asianet News TeluguAsianet News Telugu

ప్రొటోకాల్ ప్రకారమే కేసీఆర్‌ను కలిశా: రోజాకు దేవినేని ఉమా రిప్లై

విజయవాడ కనకదుర్గ గుడికి కేసీఆర్ వచ్చినప్పుడు దేవినేని ఉమా అందరికన్నా ముందు వెళ్లి కలిశారంటూ తనపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమా స్పందించారు. రాష్ట్రానికి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర కేబినెట్‌లోని వ్యక్తి స్వాగతం పలికాలని అందుకే వెళ్లానని దేవినేని స్పష్టం చేశారు.

AP Minister devineni Uma Counter statement against roja commetns
Author
Vijayawada, First Published Jan 18, 2019, 12:41 PM IST

విజయవాడ కనకదుర్గ గుడికి కేసీఆర్ వచ్చినప్పుడు దేవినేని ఉమా అందరికన్నా ముందు వెళ్లి కలిశారంటూ తనపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమా స్పందించారు. రాష్ట్రానికి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర కేబినెట్‌లోని వ్యక్తి స్వాగతం పలికాలని అందుకే వెళ్లానని దేవినేని స్పష్టం చేశారు.

ఇకపై ఆలయాల్లో రాజకీయాలు మాట్లాడకూడదని ఉత్తర్వులు జారీ చేశామని ఆయన తెలిపారు. అలాగే ఇక నుంచి టీఆర్ఎస్‌కు చెందిన నేతలు ఎవరైనా ఏపీ వస్తే కలవబోమని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టింది కేసీఆరేనని, అటువంటి కేసీఆర్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతానంటే నమ్మలేమని ఉమా వ్యాఖ్యానించారు.

డబ్బు కోసమే టీఆర్ఎస్‌తో జగన్ కలుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే రోజా... కేసీఆర్ బెజవాడ వచ్చినప్పుడు దేవినేని ఉమా ఆయనకు శాలువా కప్పి, పళ్లు ఇకిలించుకుంటూ దుర్గమ్మ దర్శనం చేయించారని మండిపడ్డారు.

ఇదే కేసీఆర్ మంత్రి దేవినేని ఉమనుద్దేశిస్తూ ఆడా, మగా అని వ్యాఖ్యానించారని, అన్ని మరిచిపోయి కేసీఆర్‌ను తీసుకెళ్లి ఉమ అమ్మవారి దర్శనం చేయించలేదా అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా తన ప్రయోజనాల కోసం నందమూరి బాలకృష్ణ కూడా కేసీఆర్ చుట్టూ తిరిగారని రోజా విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios