పవన్ కి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యే రోజా

పవన్ కి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యే రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు పవన్ పై రోజా పలుమార్లు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కాగా.. పవన్ ఇప్పుడు టీడీపీకి విరోధిగా మారారు.దీంతో.. పవన్ కి మద్దతుగా రోజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 


ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోజా.. పవన్ పై వ్యక్తిగత దూషణలు చేయడం మంచిది కాదన్నారు. కాస్టింగ్‌ కౌచ్‌పై ఇప్పటి వరకు ఫిర్యాదులు లేవని అన్నారు. ఎవరికైనా ఇబ్బందులెదురైతే నేరుగా ఫిర్యాదు చేయొచ్చునని, స్వలాభం కోసం చిత్రపరిశ్రమపై విమర్శలు చేయడం సరికాదని రోజా వ్యాఖ్యానించారు.
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివాదాస్పదమవడం దురదృష్టకరమని రోజా అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. టీటీడీ పాలకమండలిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రోజా డిమాండ్ చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos