‘మేము ధర్నా చేశాం కాబట్టే.. ఈ రోజు మీరు ఆ పాపని పరామర్శించారు’

ycp MLA roja again fire on cm chandrababu naidu
Highlights

చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డ రోజా

సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు.. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకనేందుకు ప్రతిపక్ష పార్టీ ని ఎత్తిచూపుతున్నారన్నారు. దాచేపల్లి నిందితుడు టీడీపీకి చెందినవాడేనని.. అందుకు తమ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు. కానీ.. సిగ్గులేకుండా చంద్రబాబు.. అతను వైసీపీ వాడని చెబుతున్నారన్నారు.

గడిచిన నాలుగేళ్లలో ఏపీలో చాలా మంది చిన్నారులు  అత్యాచారానికి గురయ్యారన్నారు. ఏ అత్యాచార బాధితురాలి ఇంటికి వెళ్లనిది.. కేవలం  ఈ దాచేపల్లి బాధితురాలి ఇంటికి మాత్రమే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఈ ఒక్క పాపనే  ఎందుకు చదివిస్తామని చెప్పారని అడిగారు. ఎందుకంటే.. తాను, తన పార్టీ  మహిళా నేతలు బాధిత చిన్నారికి న్యాయం చేయాలని  ధర్నా చేశామని.. అందుకే సీఎం దిగివచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆమె అన్నారు.
 

loader