Asianet News TeluguAsianet News Telugu

తప్పుడు సలహాలివ్వొద్దు: వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలనం


మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ రేట్లు సరిగా లేవని ఆయన చెప్పారు. ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సలహాలు ఇవ్వొద్దని ఆయన అధికారులకు సూచించారు.

Ycp Mla Dharmana Prasada rao  sensational comments  in Srikakulam district
Author
Srikakulam, First Published Nov 16, 2021, 2:45 PM IST

శ్రీకాకుళం: ప్రభుత్వ పనులు చేసిన వారంతా ఆర్ధికంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ రేట్లు సరిగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారుమంగళవారం నాడు మాజీ మంత్రి, ycp ఎమ్మెల్యే Dharmana Prasada rao  మీడియాతో మాట్లాడారు.  సిమెంట్ ధరలు బయట మార్కెట్‌లో మండి పోతున్నాయని చెప్పారు. బహిరంగ మార్కెట్ లో సిమెంట్, స్టీల్, ఇటుక ధరలు మండిపోతున్నాయన్నారు. దీంతో అనుకొన్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని  ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు.  కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు పరువుకు పోయి చేపట్టిన పనులతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

మెప్పు కోసం తప్పుడు సలహాలను ప్రభుత్వ పెద్దలకు ఇవ్వొద్దని ధర్మాన ప్రసాదరావు అధికారులకు సూచించారు. ప్రభుత్వ పనులు చేస్తున్న వారంతా ఆర్ధికంగా నష్టపోతున్నారన్నారు.  అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను తాను పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టుగా ధర్మాన ప్రసాదరావు చెప్పారు.

also read:కుప్పంలో వైసిపిదే విజయం... చంద్రబాబుది ఆడలేక మద్దెల ఓడు: మంత్రి బొత్స సంచలనం

శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు అట్టడుగున ఉన్నాయన్నారు.జిల్లా నుండి వేల మంది కార్మికులు వలస వెళ్తున్నారని ఆయన చెప్పారు. జాతీయ ఉపాధి హమీ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. Srikakulam  జిల్లాల్లో ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతున్నామన్నారు.పేద జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో సకాలంలో పనులు పూర్తికాకపోతే మరింత నష్టపోతామని ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు.ఉన్నతాధికారులు, ఇంజనీర్లపై నేతలు ఒత్తిడి తెస్తే పనులు కావన్నారు.

గతంలో కూడా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చకు వచ్చాయి. ధర్మాన ప్రసాదరావు సోదరుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రసాదరావుకు  జగన్ కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించినా సోదరుడికి జగన్ డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. దీంతో ప్రసాదరావుకు కేబినెట్ లో చోటు దక్కలేదు. మరోవైపు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మొదటి నుండి వైఎస్ జగన్ తో కొనసాగారు. ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ నుండి ఆలస్యంగా వైసీపీ గూటికి చేరారు.

గతంలో జిల్లాల విభజన విషయంలో కూడా శాస్త్రీయంగా విభజన జరగకపోతే  ఇబ్బందులు ఎదురౌతాయని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు  వ్యతిరేకించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రాజాం,, పాలకొండ లేని శ్రీకాకుళం జిల్లాను ఊహించుకొంటేనే భయంగా ఉంటుందని ధర్మాన ప్రసాదరావు 2020 జూలై మాసంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే జిల్లాల ఏర్పాటు విషయంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఇవాళ ధర్మానప ్రసాదరావు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios