వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు రాసారంటూ ఆళ్ళ పిటిషన్లో పేర్కొన్నారు.

మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృఫ్ణారెడ్డి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై పవురునష్టం కేసు వేసారు. ఇంతకాలం చంద్రబాబునాయుడును కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆళ్ళ ఈసారి ఏబిఎన్ రాధాకృష్ణపై గురువారం కేసు వేసారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు రాసారంటూ ఆళ్ళ పిటిషన్లో పేర్కొన్నారు. ఆళ్ళ పిటీషన్ విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 1వ తేదీన స్టేట్ మెంటను రికార్డు చేయనుంది.