జగన్ కి షాక్.. వైసీపీకి మరో నేత రాజీనామా

First Published 7, Jun 2018, 12:10 PM IST
ycp mahila leader leaves the party
Highlights

ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాననే బాధతో

వైసీపీ కి చెందిన ఓ మహిళా నేత పార్టీకి  రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయానని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు ఆమె వివరించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మేజర్‌ పంచాయతీ గ్రామ సర్పంచు హేమలత బుధవారం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచు మాట్లాడుతూ సర్పంచు పదవిలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతున్నానన్నారు. వైసీపీని నమ్ముకుంటే.. తమను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేమని ఆమె తేల్చి చెప్పారు. 
 
బోడిసా నిపల్లి తండా ఎంపీటీసీ సభ్యుడు శీననాయక్‌కు ఎంపీపీ పదవి రెండున్నర సంవత్సరాలు ఇప్పిస్తామని మొదట్లో చర్చించామన్నారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పించలేకపోయానన్నారు. దీం తో వైసీపీకి రాజీనామా చేస్తున్నానన్నారు. తనతో బాటు తన భర్తకూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నారన్నారు. గురువారం పార్టీ అధిస్టానానికి రాజీనామా లేఖ పంపుతామన్నారు. ఏ పార్టీకి అనుకూలంగా వెళ్లమన్నారు.

loader