‘స్పందిస్తారు.. కానీ న్యాయం చేయరు’

ycp leaders fire on ap ministers over agri gold issue
Highlights

ఏపీ మంత్రులపై వైసీపీ కామెంట్

రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ఏపీ మంత్రులు స్పందిస్తారు కానీ.. న్యాయం మాత్రం చేయరని వైసీపీ నేత లేళ్ల అప్పి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనల కారణంగా  అగ్రిగోల్డ్ బాధితులు ఇప్పటికీ అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. బాధితుల గురించి జగన్ మాట్లాడితే.. వెంటనే మంత్రులు స్పందిస్తారన్నారు. వారి పని కేవలం స్పందించడం మాత్రమేనని.. న్యాయం మాత్రం చేయరని మండిపడ్డారు.

‘అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశం సీఎం చంద్రబాబుకు ఏ కోశాన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇటీవల గుంటూరు జిల్లాలో ఇద్దరు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తుంది.’ 

ఢిల్లీలో చంద్రబాబును అమర్‌సింగ్‌ కలిసిన తర్వాతే ఎస్‌ఎల్‌ గ్రూపు అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొనుగోలు చేయమని చెప్పింది. కొందరు సంస్థ ఆస్తులను చవకగా కొట్టేయాలని చూస్తున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు కలిసొచ్చిన పార్టీలతో వైఎస్సార్‌సీపీ భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తుందని’  అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కన్వినర్‌ తెలిపారు.

చంద్రబాబు ఏ పని చేసినా అందులో రాజకీయ దురుద్దేశం ఉంటుందని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను  ప్రభుత్వం చౌకగా కొట్టేయాలని చూస్తోందని మండిపడ్డారు.  ఈ విషయంలో టీడీపీ ఆటలు సాగనివ్వమని చెప్పారు. 

loader