Asianet News TeluguAsianet News Telugu

న్యూయర్ వేడుకల్లో మందేసి చిందేసిన వైసీపీ నాయకులు, అధికారుల‌.. సోష‌ల్ మీడియాలో వీడియోలు వైర‌ల్

అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు న్యూయర్ వేడుకల్లో మందేసి చిందేశారు. పెద్ద ఎత్తున పార్టీ జరుపుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం సీఎం పేషీ వరకు చేరింది. 

YCP leaders and officials who were upset during the New Year celebrations .. Videos went viral on social media
Author
Amaravathi, First Published Jan 1, 2022, 9:05 AM IST

పాత ఏడాది పోయింది. కొత్త ఏడాది వ‌చ్చింది. అంద‌రూ 2021 సంవ‌త్స‌రానికి ముగింపు చెబుతూ..  2022 స్వాగతం ప‌లికారు. అయితే ఏపీలోని పొట్టి శ్రీరాములు జిల్లాలోని వైసీపీ నాయకులు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారు. ఫుల్లుగా మ‌ద్యం తాగి, మంచి జోష్‌లో స్టెప్పులేశారు. విందు ఏర్పాటు చేసుకుని తిన్నారు. ఇందులో గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్లు, ముఖ్య‌మైన ప్ర‌జాప్రతినిధులు, ఇత‌ర నాయకులు అంద‌రూ ఉన్నారు. వీరంతా క‌లిసి మందేసి చిందేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. ఈ వీడియ‌లో సీఎం పేషీ ద‌గ్గ‌రికి కూడా చేరాయ‌ని స‌మాచారం. దీంతో అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుందోన‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు. 

ఎంపీ రఘురామకృష్ణరాజు సహా 16 మందిపై సీబీఐ ఛార్జిషీట్...

నెల్లూరు జిల్లాలోని కొడ‌వ‌లూరు ప్రాంతంలోని నార్త్ రాజుపాళెంలో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్ ఉంది. నాయ‌కులు, అధికారులంతా న్యూయ‌ర్ పార్టీని ఆ గెస్ట్ హౌజ్‌లోనే నిర్వ‌హించారు. ఈ పార్టీకి స్థానిక ఎమ్మెల్యే, జిల్లాలోని ఇత‌ర ముఖ్య‌మైన నాయ‌కులు హాజ‌ర‌య్యారు. న్యూయ‌ర్ స్టార్ట్ అవ‌గానే ముందుగా కేక్ క‌ట్ చేశారు. అనంత‌రం మ‌ద్యం సేవించారు. ఇత‌ర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వారితో డీజే 
స్టెప్పుల్లో డ్యాన్స్ చేయించారు. ఈ పార్టీ రాత్రి నుంచి తెల్ల‌వారుజాము వ‌ర‌కు సాగింది. ఇందులో మ‌హిళ‌ల‌తో క‌లిసి  ప్ర‌జాప్ర‌తినిధులు, ఆఫీస‌ర్లు డ్యాన్స్ చేశారు. ఇందులో స్థానికంగా మంచి స్థాయిలో ఉన్న ఆఫీస‌ర్లు కూడా ఉన్నారు. ఇలా అమ్మాయిలో డ్యాన్స్ చేసిన వీడియోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

నూతనం… ప్రారంభం.. ఆరంభం.. New Year Whises చెప్పిన Pawan Kalyan

ఈ ఈవెంట్ కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌డంతో పాటు సీఎం పేషీకి చేరాయి. దీంతో అధికారుల్లో, వైసీపీ నాయ‌కుల్లో భ‌యం ప‌ట్టుకుంది. త‌మపై ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తోంద‌న‌ని ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఈ ఈవెంట్ ఏర్పాటు చేసిన ఒక నాయ‌కుడంటే న‌చ్చ‌ని ఆదే పార్టీకి చెందిన మ‌రో నాయ‌కుడే ఈ విష‌యాన్ని లీక్ చేశార‌ని, సీఎం పేషికి పంపించార‌ని తెలుస్తోంది. ఈ పార్టీలో స్థానిక ఎమ్మెల్యే ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న వెళ్లిపోయాకే.. ఈ మందేసి, చిందేయ‌డం వంటి కార్య‌క్ర‌మాలు జ‌రిగాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. స్థానిక అధికారులు ఇలా మందేసి చిందేసిన  విష‌యం క‌లెక్ట‌ర్ కు తెలియ‌డంతో ఆయ‌న‌కు షోకాజ్ నోటీసులు పంపించిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంపై త్వ‌ర‌లోనే స‌మాధానం చెప్పాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. క‌రోనా కేసులు పెరుగిపోతున్న దృష్ట్యా ప్ర‌భుత్వం న్యూయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించింది. ప్రైవేట్ గా వేడుక‌లు జ‌రుపుకుంటే అతి త‌క్కువ మందితోనే నిర్వ‌హించుకోవాల‌ని సూచించింది. అయితే ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఇలా పార్టీ నిర్వ‌హించుకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఈ ఈవెంట్ పై నెటిజ‌న్లు ట్రోలింగ్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios