వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి.. తన సోదరుడు వైఎస్ ప్రతాప్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు.  ఈ సంఘటన కడప జిల్లా పులివెందులలో సోమవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...వైఎస్ వివేకానంద రెడ్డి అనుచరుడు రవీంద్రనాథ్ రెడ్డి.. కొన్ని సంవత్సరాలుగా వివేకా సోదరుడు ప్రతాప్ రెడ్డి బంధువు రాజశేఖర్ రెడ్డితో వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరూ చిత్తూరు జిల్లా కుప్పం వద్ద గ్రానైట్ క్వారీని లీజుకు తీసుకున్నారు. ఈ క్వారీ దాదాపు రూ.600కోట్ల విలువ చేస్తుందని అంచనా.

2008లో మొదలైన ఈ క్వారీ.. 2012 వరకు రాజశేఖర్ రెడ్డి ఆధీనంలోనే సాగింది. అప్పటికే రవీంద్రనాథ్ రెడ్డి దాదాపు రూ.50లక్షలు రాజశేఖర్ రెడ్డికి ఇచ్చారు. అయితే.. ఇంత వరకు వ్యాపారంలో వచ్చిన లాభాలు కానీ.. డబ్బులు కానీ ఇవ్వలేని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ వివేకానంద రెడ్డిని ఆశ్రయించాడు.

తన అనుచరుడికి న్యాయం చేసేందుకు వివేకానందరెడ్డి.. తన సోదరుడు ప్రతాప్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు.