అసత్య ప్రచారాలు చేయడమనేది టీడీపీ డీఎన్ఏలోనే ఉందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైఎస్ షర్మిళ ని కించపరిచేలా  సోషల్ మీడియాలో కించపరుస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై ఆమె ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆ పార్టీ నేత రామకృష్ణా రెడ్డి స్పందించారు.

షర్మిలపై జరగుతున్న విషప్రచారంపై తాము హైదరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.  ఏపీ పోలీసులపై నమ్మకంలేకే తాము తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా హింసించం టీడీపీ రాజకీయ ఎజెండా అని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే తమ పార్టీ నేతలపై చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.

ఇది కేవలం షర్మిలపై జరిగిన విష ప్రచారం కాదని.. మహిళలందరిపై జరిగిన దాడిగా ఆయన పేర్కొన్నారు. ఈ అసత్యప్రచారంలో టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేకపోతే.. చంద్రబాబు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు ఇక్కడ చదవండి

షర్మిలపై కామెంట్స్.. మాకేం సంబంధం లేదన్న బుద్ధా

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల