కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే.. ప్రజలే చంద్రబాబుని గుడ్డలూడదీసి తంతారని ఒకప్పుడు టీడీపీ నేతలు  వ్యాఖ్యానించిన విషయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.  కొద్దిరోజుల క్రితం కూడా టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలపై స్పందించిన మంత్రి అయ్యన్నపాత్రుడు, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తులు ఖండించారు. అంతేకాదు.. అలా చేస్తే ప్రజలు చంద్రబాబుని గుడ్డలూడదీసి కొడతారని పేర్కొన్నారు.

కాగా.. ఇప్పుడు నిజంగానే చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు రాహుల్ గాంధీని కూడా కలిశారు. అయితే.. అప్పుడు మంత్రులు మాట్లాడిన మాటలు ప్రజలు నిజం చేస్తారా..? ఆ మంత్రులు ఇప్పుడేమంటారని వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీది రక్తంతో కడిగిన హస్తమని ఒకప్పుడు చంద్రబాబే విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ చేతిలో చెయ్యి వేసి నడవడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని ఆరోపించారు. 

‘పదవుల కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతాడు. ఎంతటి నీచ నికృష్ట రాజకీయాలు చేయడానికైనా సిద్దపడతారని మరోసారి రుజువైంది’ అని ఎమ్యెల్సీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి అన్యాయం చేసిన విషయాన్ని మర్చిపోయారా అని ఆయన బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. 

more news

కాంగ్రెస్‌తో పొత్తుపై మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు