విశాఖపట్టణం: కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలసలు వస్తున్న నేపథ్యంలో మంత్రి అయ్యన్నపాత్రుడు సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీపొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఏమీ ఉండదన్నారు. 

సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తులాంటి పెద్ద తప్పులు చెయ్యరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ అలాంటి తప్పు చేస్తే అంతకంటే పెద్ద తప్పు ఏమీ ఉండదన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలన్న ఏకైక ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ తో పొత్తు అంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదన్నారు...కాంగ్రెస్ తో పొత్తును తామే కాదు ప్రజలు కూడా క్షమించరని మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.