వైసిపికి  షాక్

వైసిపికి  షాక్

చిత్తూరు జిల్లాలో ప్రతిపక్ష వైసీపీకి షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు సుబ్రమణ్యంరెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడుపై సుబ్రమణ్యంరెడ్డి మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఆదివారం అమరావతికి వచ్చిన సుబ్రమణ్యం‌రెడ్డి సీఎంక్యాంపు కార్యాలయంలో చంద్రబాబునాయుడిని కలిశారు. అయితే చంద్రబాబు త్వరలో చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జిల్లాలోనే టీడీపీలో చేరేందుకు నిర్ణయించారు.

చాలా కాలంగా వైసిపి నేతలను ఆకర్షించేందుకు టిడిపి ప్రలోభాలకు దిగటం అందరూ చూస్తున్నదే. ఇందులో భాగంగానే సుబ్రమణ్యంరెడ్డి వ్యవహారం ఫైనల్ అయ్యింది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అధికార తెలుగుదేశం పార్టీ  వివిధ జిల్లాల్లోని వైసీపీ నేతలను టీడీపీలోకి లాక్కుంటోంది. ఇప్పటి వరకు 22 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగిన టీడీపీ ఇక కిందిస్థాయి కేడర్ పై కన్నేసింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos