ప్రభుత్వానికేమో ప్రతిదీ టెంపర్వరీ నిర్మాణాలు. వ్యక్తిగతానికేమో శాస్వత, అద్భుత నిర్మాణాలు. ఎలాగుంది చంద్రన్న పరిపాలన?
తెలుగుదేశం పార్టీకి(టిడిపి)కి వైసీపీ ఎంఎల్ఏ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కొత్త పేరు పెట్టారు. టెంపర్వరీ డెవలప్ మెంట్ పార్టీ అని. అఫ్ కోర్స్ గతంలోనే ఈ విషయం చెప్పారులేండి. టెంపర్వరీ అంటే తెలిసిందే కదా? ఏదో తాత్కాలికంగా చేసుకునే ఏర్పాటు. చంద్రబాబునాయుడు వ్యవహారం అదే విధంగా సాగుతోందట ప్రతీ విషయంలోనూ. రాజధాని టెంపర్వరీ. సచివాలయం టెంపర్వరీ. వెలగపూడిలో అసెంబ్లీ కూడా టెంపర్వరీనే అట. చివరకు చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు కూడా టెంపర్వరీనే.
అంటే వందల కోట్ల రూపాయల వ్యయంతో పైన నిర్మించిన ప్రతీ నిర్మాణమూ టెంపర్వరీనే అన్నమాట. తాత్కాలిక ఏర్పాటన్నపుడు ఎవరైనా వందల కోట్ల రూపాయలు వ్యయం చేస్తారా? కానీ మన నిప్పు చంద్రబాబు చేసారు. అందుకనే టెంపర్వరీ నిర్మాణాలపై చేసిన ఖర్చులపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్) ప్రభుత్వాన్ని కడిగిపారేసింది. ప్రభుత్వానికేమో ప్రతిదీ టెంపర్వరీ నిర్మాణాలు. వ్యక్తిగతానికేమో శాస్వత, అద్భుత నిర్మాణాలు. ఎలాగుంది చంద్రన్న పరిపాలన?
