CM Jagan: 45 రోజుల్లో ఎన్నికలు.. ప్రకటించినవారే అభ్యర్థులు: సీఎం జగన్
45 రోజుల్లో ఎన్నికలు వస్తాయని, అభ్యర్థులు సిద్ధం కావాలని సీఎం జగన్ అన్నారు. వైసీపీ ప్రకటించిన ఇంచార్జులే అభ్యర్థులని స్పష్టం చేశారు. ఒకటి అరా మినహాయిస్తే.. ఆ జాబితానే ఫైనల్ అని పేర్కొన్నారు. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 పార్లమెంటు సీట్లు గెలవాల్సిందేనని స్పష్టం చేశారు.
ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. తాము ప్రకటించిన ఇంచార్జులే అభ్యర్థులని స్పష్టం చేశారు. ఒకటి అరా అక్కడో ఇక్కడో మినహాయిస్తే.. అభ్యర్థులను మార్చాల్సిన పని లేదని తెలిపారు. ఎందుకంటే మార్చాల్సిన వారిని ఇప్పటికే దాదాపుగా మార్చేశామని చెప్పారు. 99 శాతం మార్పులు జరిగిపోయాయని, కాబట్టి, ప్రకటించిన లిస్టులోని నాయకులే ఆయా నియోజకవర్గాలు అభ్యర్థులు అని వివరించారు. అభ్యర్థులు కాన్ఫిడెంట్‌గా, కచ్చితత్వంతో ప్రజల్లోకి వెళ్లాలని వివరించారు. రెట్టించిన ఉత్సాహంలో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పేదలు బాగుపడాలంటే వైసీపీ ప్రభుత్వమే రావాలని పేర్కొన్నారు.
బహుశా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని ఆయుధాన్ని తమ ప్రభుత్వం అభ్యర్థులకు ఇచ్చిందని సీఎం జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల వివరాలు, ప్రజల కోసం పెట్టిన ఖర్చును వివరాలతోపాటు ఇంటింటికి ఒక లెటర్ తీసుకుని వెళ్లి చూపించే పరిస్థితి తమ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పారు.
కాబట్టి, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అభ్యర్థులదే అని సీఎం జగన్ వివరించారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని చూపించి గెలుచుకోవాలని వివరించారు. ఆర్గనైజేషన్ మీద శ్రద్ధ పెట్టాలని సూచనలు చేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సేవ చేసిందని జగన్ వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి.. అక్కా మీ ఇంటికి ఇంత మంచి జరిగిందని చెప్పే అవకాశాన్ని అభ్యర్థులకు ఇచ్చామని తెలిపారు. ‘ప్రతి ఇంటికి అలా చెప్పగలిగినప్పుడు ప్రతి గ్రామంలో మనకు మెజార్టీ ఎందుకు రాదు. అదే మెజార్టీ మండలంలో ఎందుకు రాదు? అదే మెజార్టీ నియోజకవర్గంలోనూ తప్పక వస్తుంది’ అని జగన్ పేర్కొన్నారు.
Also Read: Explained: గగన్‌యాన్ మిషన్ కోసం ఒక్క మహిళా పైలట్‌నూ ఎందుకు ఎంచుకోలేదు?
‘గతంలో మీరు 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారు. కానీ, ఇప్పుడు 175కు 175 ఎమ్మెల్యేలను గెలిపించాల్సిందే’ అని జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 175 వైసీపీ గెలుచుకోవాల్సిందేనని సీఎం జగన్ అన్నారు. అలాగే.. 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు గెలుచుకోవాల్సిందేనని వివరించారు. ఈ 45 రోజుల్లో కష్టపడాలని, కాన్ఫిడెన్స్‌గా ప్రజల్లోకి వెళ్లి గెలిచేలా పని చేయాలని క్యాడర్‌కు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.