ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలపై అధికార వైసీపీ కొరడా ఝళిపించింది. గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ భారీగా జరిమానాలు విధించింది. టీడీపీ నేత మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌లకు చెందిన క్వారీల్లో అక్రమాలు జరిగాయంటూ మైనింగ్ శాఖ నుంచి నోటీసులు వెళ్లాయి.

Also Read:పార్టీ మార్పుపై తేల్చేసిన గొట్టిపాటి

చీమకుర్తి మండలం పరిధిలోని బల్లికురవ, గురిజేపల్లి ప్రాంతాల్లో బ్లాక్ గ్రానైట్ నిక్షేపాలను భారీగా వెలికి తీస్తారు. ఈ రెండు ప్రాంతాల్లో సమారు 35 వరకు క్వారీలు వున్నాయి. వీటిలో మెజారిటీ సంస్థలు శిద్ధా రాఘవరావు, గొట్టిపాటి రవికుమార్, బీజేపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు బంధువులు, అనుచరులవే.

అక్రమాలకు పాల్పడ్డారంటూ గరికపాటి మోహన్ రావుకు రూ.286 కోట్లు, గొట్టిపాటికి రూ.303 కోట్లు జరిమానా విధించారు. కేవలం టీడీపీ నేతల క్వారీలకు జరిమానాలు వెళ్లడంతో అధికార పార్టీ తమను ఉద్దేశ్యపూర్వకంగానే టార్గెట్ చేశారంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు.

Also Read:వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ : వంశీ బాటలోనే మరో టీడీపీ ఎమ్మెల్యే

బల్లికురవలో అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడికి క్వారీ ఉంది. ఇక్కడా అనేక అక్రమాలు జరిగినట్లు తనిఖీల్లో తేలింది. అయితే ఆయనకు మాత్రం కేవలం రూ.70 కోట్ల జరిమానా విధించడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.