మా నాన్న రెక్కీ చేశాడనేది అబద్ధం.. ఆయన ఆరోగ్యం బాలేదు.. : అరవ సత్యం కొడుకు చరణ్ తేజ (వీడియో)
మా ఇంటి దగ్గర ఆరోగ్య పరిస్థితి బాగోలేదని గమనించి నిన్న సరాసరి ఆసుపత్రికి తీసుకువచ్చారు. బ్లడ్ ప్రెజర్ ఎక్కువ కావడంతో వచ్చి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూ లో ఉన్నారు. నెహ్రూ స్పూర్తితో మా నాన్న పైకి వచ్చారు. ఆయన వెనక ఎవ్వరూ లేరు. స్వయంగా ఎదిగారు.
విజయవాడ : Vangaveeti Radha చేసిన రెక్కి ఆరోపణల నేపధ్యంలో తన తండ్రి విషయంపై వైసీపీ ఫ్లోర్ లీడర్ Venkata Satyanarayana కొడుకు చరణ్ క్లారిటీ ఇచ్చాడు. అరవ సత్యం కొడుకు charan teja మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం ఒక కార్యక్రమనికి మా నాన్న అటెండ్ అయ్యారు. కావాలంటే సిసి ఫూటేజ్ చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
"
మా ఇంటి దగ్గర ఆరోగ్య పరిస్థితి బాగోలేదని గమనించి నిన్న సరాసరి ఆసుపత్రికి తీసుకువచ్చారు. బ్లడ్ ప్రెజర్ ఎక్కువ కావడంతో వచ్చి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూ లో ఉన్నారు. నెహ్రూ స్పూర్తితో మా నాన్న పైకి వచ్చారు. ఆయన వెనక ఎవ్వరూ లేరు. స్వయంగా ఎదిగారు.
మానాన్న హెల్త్ విషయం విని బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న నేను అక్కడి నుంచీ పరిగెత్తుకుంటూ వచ్చాను. అరవ సత్యం రెక్కీ చేసారు.. అని చెపుతున్నది అబద్ధం. ఓ చానల్ లో ఆయనని కష్టడీ కి తీసుకున్నది అబద్ధం. మాకు ఎవరితో ఎటువంటి గొడవలూ లేవు. మేం కష్టంలో ఉండగా ఇలా మా మీద నెగెటివ్ గా రాయద్దు.
మా పనేదో మేం చూసుకుంటున్నాం. ఆయన ఇంకా 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉండాలి. దయచేసి అర్ధం చేసుకుని సహకరించాలని కోరారు. కొంతమంది పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఆయన కోలుకుని బయటకు వచ్చాక మాట్లాడతారు అంటూ చెప్పుకొచ్చారు.
రాధా హత్యకు రెక్కీ: పోలీసుల అదుపులో దేవినేని రైట్ హ్యాండ్ అరవ సత్యం .. స్పృహ తప్పడంతో ఆసుపత్రికి
ఇదిలా ఉండగా, మంగళవారం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇంటి వద్ద రెక్కీ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బెజవాడకు చెందని కొందరు అనుమానితులపై పోలీసులు దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా కార్పోరేటర్ అరవ సత్యంను పోలీసులు ప్రశ్నించారు. అయితే పోలీసుల విచారణలో arava sathyam స్పృహ కోల్పోయినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం అరవ సత్యం ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. అటు వంగవీటి రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. దేవినేని నెహ్రూకు అరవ సత్యం అత్యంత సన్నిహితుడుగా స్థానికులు చెబుతున్నారు. అయితే రెక్కీ ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అరవ సత్యం కొడుకు చరణ్ మీడియా ముందుకు వచ్చాడు.
నిన్నటి నుంచి తన తండ్రి ఆరోగ్యం బాలేదని.. గతంలో సర్జరీ జరిగిందని అతను చెప్పాడు. హై బీపీతో నేరుగా ఆసుపత్రికి వచ్చారని.. 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో వుండాలనన్నారని చరణ్ తెలిపాడు. రెక్కీ నిర్వహించారని బురద జల్లారని.. ఏ కస్టడీకి మా నాన్నను ఎవరూ తీసుకెళ్లలేదని ఆయన స్పష్టం చేశాడు. తమకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవని.. దీనిని ఎటువంటి వివాదం చేయవద్దని చరణ్ విజ్ఞప్తి చేశాడు.