రాధా హత్యకు రెక్కీ: పోలీసుల అదుపులో దేవినేని రైట్ హ్యాండ్ అరవ సత్యం .. స్పృహ తప్పడంతో ఆసుపత్రికి
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇంటి వద్ద రెక్కీ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బెజవాడకు చెందని కొందరు అనుమానితులపై పోలీసులు దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా కార్పోరేటర్ అరవ సత్యంను పోలీసులు ప్రశ్నించారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇంటి వద్ద రెక్కీ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బెజవాడకు చెందని కొందరు అనుమానితులపై పోలీసులు దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా కార్పోరేటర్ అరవ సత్యంను పోలీసులు ప్రశ్నించారు. అయితే పోలీసుల విచారణలో అరవ సత్యం (arava sathyam) స్పృహ కోల్పోయినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం అరవ సత్యం ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. అటు వంగవీటి రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. దేవినేని నెహ్రూకు అరవ సత్యం అత్యంత సన్నిహితుడుగా స్థానికులు చెబుతున్నారు. అయితే రెక్కీ ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అరవ సత్యం కొడుకు చరణ్ మీడియా ముందుకు వచ్చాడు. నిన్నటి నుంచి తన తండ్రి ఆరోగ్యం బాలేదని.. గతంలో సర్జరీ జరిగిందని అతను చెప్పాడు. హై బీపీతో నేరుగా ఆసుపత్రికి వచ్చారని.. 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో వుండాలనన్నారని చరణ్ తెలిపాడు. రెక్కీ నిర్వహించారని బురద జల్లారని.. ఏ కస్టడీకి మా నాన్నను ఎవరూ తీసుకెళ్లలేదని ఆయన స్పష్టం చేశాడు. తమకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవని.. దీనిని ఎటువంటి వివాదం చేయవద్దని చరణ్ విజ్ఞప్తి చేశాడు.
కాగా.. ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను వంగవీటి రాధా తిరస్కరించినట్లుగా వార్తలు వస్తుండటంతో స్వయంగా ఆయనే స్పందించారు. గన్‌మెన్లను తిరస్కరించిన మాట నిజమేనని అన్నారు. తాను నిత్యం ప్రజల్లో వుండే వ్యక్తినని .. అందుకే సెక్యూరిటీ వద్దన్నానని చెప్పుకొచ్చారు. అన్ని పార్టీల నుంచి నేతలు తన క్షేమంపై ఆరా తీశారన్నారు రాధా.
Also Read:హత్యకు కుట్ర: అభిమానులే రక్ష .. గన్‌మెన్లను తిరస్కరించిన వంగవీటి రాధాకృష్ణ
పోలీసులు ఇప్పటి వరకు తన దగ్గరకు రాలేదని.. వస్తే స్పందిస్తానని చెప్పారు వంగవీటి రాధాకృష్ణ. మరోవైపు వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ అంశంపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. రాధాతో నిన్న రాత్రి పోలీసులు ఫోన్‌లో మాట్లాడి కొన్ని వివరాలు సేకరించారు. రాధా సన్నిహితుల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరించాయి. అనుమానిత ఆధారాల కోసం ముమ్మర విచారణ కొనసాగుతోంది.
తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని సంచలన ఆరోపణలు చేసిన vangveeti Radhaకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2+2 సెక్యూరిటీని కల్పించాలని సీఎం Ys Jagan పోలీస్ అధికారులను ఆదేశించారు. తన పై కుట్ర జరుగుతోందని, తనని చంపడానికి రెక్కి నిర్వహించారని రాధా ఆ దివారం నాడు గుడివాడలో అన్నారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఇంటిలిజెన్స్ డీజీపీ ని సీఎం జగన్ ఆదేశించారు.