అమరావతి: కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కోసం విడుదల చేస్తున్న నిధులన్నీ వైకాపా ప్రభుత్వం నవరత్నాలకే మళ్ళిస్తుంది అని తేదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ లు దుయ్యబట్టారు. 

గతంలో తమ ప్రభుత్వం ఉపాధి హామి కింద చేసిన పనులకు వైకాపా ప్రభుత్వం బిల్లులు ఆపేయడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చింది అని విమర్శించారు. 

2006లో జరిపిన ఉపాధి హామీ నియామకాలను కాదని ఇప్పటి ప్రభుత్వం వాలంటిర్లను నియమించడమే కాకుండ, గ్రామ సచివాలయాలకు రంగులు మార్చి  వైకాపా పార్టీ కార్యాలయాలుగా మారుస్తున్నారని ఆరోపించారు. 

తమ అధినేత మాజీ సీఎం చంద్రబాబు లేఖను విడుదల చేసిన తరుణంలో దానిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతాం అని కేంద్రం హామి ఇచ్చిందని కూడా తెలిపారు.