కర్నూల్: కరోనా మహమ్మారి జనంపై పంజా విసురుతూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కరోనా వైరస్ సోకి మృతి చెందుతున్న వారు కొందరైతే , కరోనా వస్తుందేమో అన్న భయంతో వణికి చస్తున్నావారు మరికొందరున్నారు. ఒకేరోజు తల్లి , కుమారుడిని కరోనా వైరస్ మహమ్మారి కాటికి పంపిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదరాసి గ్రామంలో ఒకే రోజు కేవలం మూడు గంటల వ్యవధిలోనే తల్లి కుమారుడు కరోనా వైరస్ కారణంగా  మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంతేకాకుండా ఇలా కరోనా మరణాలు చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు అలుముకున్నాయి.

జోలదరాసి గ్రామానికి చెందిన వైయస్సార్ పార్టీ సీనియర్ నేత, కోయిలకుంట్ల సహకార సంఘం అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి గత నాలుగు రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

read more   బ్రేకింగ్: కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాల రావు మృతి

గత నాలుగు రోజులుగా వైద్య చికిత్సలు చేస్తున్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో, పరిస్థితి  పూర్తిగా విషమించింది.  డాక్టర్లు మెరుగైన వైద్యం అందించినప్పటికీ  కోలుకోలేక  రామేశ్వర్ రెడ్డి మృతి చెందాడు.

కుమారుడు కరోనాతో మృతిచెందినట్లు తెలిసిన వృద్ధాప్యంలో ఉన్న తల్లి గుండె తట్టుకోలేకపోయింది , తాను బ్రతికుండగానే తనయుడు కళ్లెదుటే మృతిచెందడంతో  పాటు తనకు కూడా కరోనా వైరస్ వస్తుందేమో అన్న భయం వృద్ధురాలిని వెంటాడింది. ఇలా అటు కొడుకు మరణం ఇటు కరోనా భయంతో మృతుడి తల్లి నారాయణమ్మ (80) కూడా తనువు చాలించింది.

ఒకే రోజు కేవలం మూడు గంటల వ్యవధిలోనే తల్లి కుమారుడు కరోనా వైరస్ కారణం గా మృతి చెందడంతో  జోలదరాసి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
వైయస్సార్ పార్టీ సీనియర్ నేత రామేశ్వర్ రెడ్డి మృతిచెందడంతో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  పలువురు వైసిపి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.