కరోనాతో మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాల రావు కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయనకు పాజిటివ్‌గా రావడంతో గత నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో మాణిక్యాల రావు చికిత్స పొందుతున్నారు.

2014లో బీజేపీ తరపున తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాల రావు.. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఆయన మంత్రిగా పదవి పొందడం విశేషం. ఫోటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన మాణిక్యాల రావు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 

Also Read:మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్

తనకు కరోనా వచ్చిందని ఆయన జూలై 4న స్వయంగా వెల్లడించారు. ఇటీవల పాజిటివ్‌గా నిర్థారణ అయిన మాజీ మున్సిపల్ ఛైర్మన్, బీజేపీ నేతతో సహా కాంటాక్ట్ వున్న వాళ్లకి పరీక్షలు  నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందని ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

అప్పటి నుంచి విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న  ఆయనకు.. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తోంది.