మేమంతా సిద్ధం: జగన్ బస్సు యాత్ర ప్రారంభం..
వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ రోజు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు.
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఈ యాత్ర సాగనున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం సీఎం జగన్ ఈ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి నుంచి ఇడుపుల పాయకు చేరుకున్న వైఎస్ జగన్.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. వైఎస్ జగన్‌ను ఆశీర్వదించి ఈ బస్సు యాత్రకు తల్లి విజయమ్మ సాగనంపారు. యాత్రకు సిద్ధమైన బస్సులో వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డి మేన మామా రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా వైసీపీ నాయకులు ఎక్కారు.
ఈ రోజు కడప జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ జగన్ ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో నిర్వహించతలపెట్టిన సభలో ప్రసంగిస్తారు. రాత్రికల్ల నంద్యాల జిల్లాకు చేరుకుంటారు. ఆళ్లగడ్ఢలో సీఎం జగన్ రాత్రి బస చేస్తారు.