ముందుగా అనుకున్నట్లే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్దమవుతున్నారా? మరి న్యాయస్ధానం ఆంక్షల మాటేమిటి ? మొత్తానికి జగన్ పాదయాత్ర సస్పెన్స్ గా తయారైంది.
ముందుగా అనుకున్నట్లే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్దమవుతున్నారా? మరి న్యాయస్ధానం ఆంక్షల మాటేమిటి ? మొత్తానికి జగన్ పాదయాత్ర సస్పెన్స్ గా తయారైంది. ఎందుకంటే, ఈనెల 27వ తేదీ నుండి మహా పాదయాత్ర ను ప్రారంభించాలని జగన్ నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కేసుల విచారణలో భాగంగా ప్రతీ శుక్రవారం జగన్ కోర్టులో హాజరవ్వాలన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపును కోరుకుంటే, కోర్టు అందుకు అంగీకరించలేదు. దాంతో పాదయాత్ర సందిగ్దంలో పడిందని వైసీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయ్. మహాపాదయాత్రకు ప్రత్యామ్నాయంగా జిల్లాల యాత్రలు ప్లాన్ చేసుకుంటున్నట్లు వైసీపీ వర్గాలే చెప్పాయి.

అదే విషయంపై ఇపుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. పాదయాత్రలో మార్పులు చేస్తున్నారని, ముహూర్తం మారిందని రకరకాల ప్రచారాలు జరుగుతున్న విషయం కూడా వాస్తవమే. ఇటువంటి నేపధ్యంలోనే జగన్ మంగళవారం త్రిదండి శ్రీమన్నారయణ రామానుజ చిన్న జియ్యర్ స్వామిని కలిసారు. సుమారు అర్దగంట పాటు ఇద్దరి మధ్య ఏకాంత చర్చలు జరిగాయి. అనంతరం జగన్ తన వ్యక్తిగత ట్వట్టర్లో ‘‘త్రిదండి చిన్న జియ్యర్ ను కలిసి పాదయాత్రకు ముందు ఆశీస్సులు తీసుకున్నాను’’ అంటూ ట్వట్టర్లో ఓ పోస్టు పెట్టారు. దాంతో జగన్ పాదయాత్ర ఖాయమన్న విషయం తేలిపోయింది. అయితే, ఏ రోజు నుండి ? అన్నదే సస్పెన్స్.
