వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ రోజా అరెస్ట్.. గొడవ చేయకపోయినా అరెస్ట్ చేస్తారా: రోజా

Ycp Ap bundh: MLA Roja arrest in puttur
Highlights

పుత్తూరులో నిరసన ర్యాలీ చేపట్టేందుకు వచ్చిన నగరి ఎమ్మెల్యే రోజాను పోలీసులు అరెస్ట్ చేశారు.. బైపాస్ రోడ్ ద్వారా పట్టణంలోకి ప్రవేశించేందుకు వస్తుండగా అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా బంద్ జరుగుతోంది.. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు బంద్‌ను నిర్వహించడంతో పాటు పలు చోట్ల ఆందోళన చేపడుతున్నాయి. బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.

ఈ సందర్భంగా పుత్తూరులో నిరసన ర్యాలీ చేపట్టేందుకు వచ్చిన నగరి ఎమ్మెల్యే రోజాను పోలీసులు అరెస్ట్ చేశారు.. బైపాస్ రోడ్ ద్వారా పట్టణంలోకి ప్రవేశించేందుకు వస్తుండగా అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన రెడీగా ఉన్న గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కె. నారాయణ స్వామిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు..

ఈ సందర్భంగా రోజా ప్రభుత్వంపై ఫైరయ్యారు.. శాంతియుతంగా ధర్నాలు,  నిరసనలు చేస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వ పెద్దలు తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. 
 

loader