పులివెందులలో ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైంది. పట్టణంలోని పూలఅంగళ్ళ సర్కిల్ వద్ద వైసిపి-టిడిపి కార్యకర్తల మధ్య వివాదం తలెత్తటంతో అదికాస్త ఉద్రిక్తతంగా మారింది. విషయం తెలియగానే వందల సంఖ్యలో చేరుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడకి చేరుకున్నారు. వారితో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా చేరుకోవటంతో అక్కడంతా తీవ్రమైన గందరగోళం మొదలైంది.

ఇరు పార్టీల కార్యకర్తల కేకలు, ఈలలతో  పూలఅంగళ్ళ ప్రాంతమంతా అట్టుడుకిపోతోంది. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్న కార్యకర్తలు. ప్రధాన నేతలను హౌస్ అరెస్టు చేయడంతో కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి గోల మొదలుపెట్టారు. ఇంతలో పోలీసుల అత్యుత్సాహం వల్ల ఓ వైసిపి కార్యకర్త తలపై బలమైన గాయాలయ్యాయి. మొత్తానికి పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.