Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. పన్నెండేళ్ల బాలికపై వైసీపీ కార్యకర్త అత్యాచారయత్నం..

పల్నాడు జిల్లాలో ఓ వైసీపీ కార్యకర్త దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12యేళ్ల బాలిక మీద అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేస్తూ, ఇంట్లోనుంచి బైటికి పరిగెత్తడంతో పారిపోయాడు.

YCP activist sexual assault on twelve-year-old girl in palnadu district
Author
First Published Sep 15, 2022, 7:10 AM IST

పల్నాడు జిల్లా : ఓ బాలికపై వైసీపీ కార్యకర్త అత్యాచారయత్నం చేసిన ఉదంతం బుధవారం వెలుగుచూసింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన బాలిక (12)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో వైసీపీ కార్యకర్త కానాల నరేందర్ రెడ్డి అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలు కేకలు వేస్తూ, బయటకు రావడంతో నిందితుడు పరారయ్యాడు. తల్లిదండ్రులు పొలం నుంచి ఇంటికి రాగానే బాలిక ఈ విషయం చెప్పింది. 

దీంతో వారు కుమార్తెను తీసుకుని దాచేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ అధికారులు బుధవారం తెల్లవారుజామున బాలికను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ షేక్ బిలాలుద్దీన్ తెలిపారు. నిందితుడు నరేందర్రెడ్డి మూడేళ్ల క్రితం కూడా ఒక బాలిక పై అత్యాచారయత్నానికి పాల్పడగా పోలీసులు అరెస్టు చేశారు. 

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. డీజీపీకి వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 4న విజయనగరం జిల్లా  పూసపాటిరేగ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా సర్పంచ్ 11మంది లైంగిక దాడికి ప్రయత్నించారు. ఈ మేరకు ఆమె విజయనగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను రేకుల షెడ్ లో ఉండగా ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం పి.రమణ బాబు, పి. సుధాకర్, పి. మధు, పి. జగదీష్, పి. భద్రరావు, ఎల్. సురేష్ కుమార్, ఏ. శ్రీనివాస రావు, ఎల్ వెంకటరాజు, పి. ప్రసాద్, ఈ సోమశేఖర్, పి. శ్రీనివాస రావు వచ్చి లైంగిక దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు. 

ప్రతిఘటించే ప్రయత్నంచేయడంతో చంపాలని చూశారని అన్నారు. మెడ భాగం,  పొత్తికడుపు, ఇతర అవయవాలపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారని వెల్లడించారు. కేకలు వేయగా చుట్టుపక్కలవారు రావడంతో పారిపోయారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యామలాదేవి చెప్పారు. 

కాగా, జూన్ 14న ఇలాంటి ఘటనే గుంటూరులో చోటు చేసుకుంది. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురం గ్రామ దళిత మహిళా సర్పంచ్ శిఖా విజయలక్ష్మి పట్ల వైసిపి నాయకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె భర్త యాకోబు, కుమారుడు నవీన్ ను చంపేస్తామని బెదిరించారు. ఎస్ఐ ప్రతాప్ కుమార్ కథనం ప్రకారం.. ఘటన జరిగిన రోజు సాయంత్రం గ్రామ శివారులోని చెరువులో అక్రమంగా మట్టి తగ్గుతున్నట్లు సర్పంచ్ కి సమాచారం వచ్చింది. 

ఆమె తన భర్త, కుమారుడితో చెరువు వద్దకు వెళ్లి దీనిపై ప్రశ్నించారు.వైసిపి నాయకులు మాచర్ల మధు, సురేష్ వారిని దుర్భాషలాడటంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు. మరో వైసీపీ నాయకుడు  మాచర్ల ఏసోబు సర్పంచ్ కుమారుడిని చంపేయాలని మిగిలినవారిని ఉసిగొలిపాడు. ‘నా వైపు  ఎమ్మెల్యే ఉన్నారు. మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’ అని  బెదిరించాడని అదే రోజు రాత్రి సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్ధరాత్రి కేసు నమోదైంది. గుంటూరులోని టిడిపి కార్యాలయంలో సర్పంచ్ విజయలక్ష్మి, భర్త యాకోబు, కుమారుడు నవీన్  తలదాచుకున్నారు. రాత్రి  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు భయపడిన వారు టిడిపి జిల్లా నాయకులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి గుంటూరుకు చేరుకుని పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios