Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. డీజీపీకి వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ మేరకు డీజీపీని కలిసి ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు

ap women's commission chairperson vasireddy padma complaint to ap dgp on tdp leaders
Author
First Published Sep 14, 2022, 9:23 PM IST

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతిపై సోషల్ మీడియాలో ఉద్దేశ పూర్వకంగా వాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డీజీపీని కోరారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సతీమణి భారతి గత ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు వక్రీకరించి ఒక వర్గం సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన ఆధారాలు డీజీపీకి సమర్పించామన్నారు. 

మహిళలను అడ్డుపెట్టుకుని వారినే లక్ష్యంగా పెట్టుకుని నీచ రాజకీయాలు చేయటం తగదని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. లిక్కర్ మాఫియాలో భారతిపై నిరాధారమైన ఆరోపణలు చేసి ముఖ్యమంత్రిని మానసికంగా కుంగతీయాలనే ఆలోచనలో టీడీపీ నేతలు వున్నారని ఆమె ఆరోపించారు. మహిళలను లక్ష్యంగా పెట్టుకుని మెట్టమెదటిసారిగా  నాడు జగన్ మోహన్ రెడ్డి కుటుంబలోని మహిళలపై రాజకీయ దాడి చేసింది తెలుగుదేశం పార్టీయేనని పద్మ ఆరోపించారు. ముఖ్యమంత్రితో తేల్చుకోవాల్సిన విషయాలు ను ఆయనతో తేల్చుకోలేక ఆయన భార్యపై బురద చల్లాలనుకోవటం నీచమైన సంస్కృతి అని ఆమె ఎద్దేవా చేశారు. మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవారికి కఠినమైన సంకేతాలు పంపాలని వాసిరెడ్డి పద్మ కోరారు. 

ALso REad:ఇంటి ముందు రోడ్డు వేయించుకోలేని సన్నాసివి.. బాబును విమర్శిస్తావా : కొడాలి నానికి అమర్‌నాథ్ రెడ్డి వార్నింగ్

అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో వైఎస్ భారతికి సంబంధమేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. గత శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ వెళ్లి వైన్ షాపులకు లైసెన్స్ అడిగే ఖర్మ ఆమెకు లేదన్నారు. ఒక రాష్ట్రంలో అధికారంలో వుండి , ఢిల్లీకి వెళ్లి స్కామ్‌లో వాటా అడుక్కుంటారా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌ను జైల్లో పెట్టి ఏం సాధించారని కొడాలి నాని నిలదీశారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు కుప్పంలో... లోకేష్ మంగళగిరిలో గెలవరని నాని జోస్యం చెప్పారు. ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ ఎంత.. ఇక్కడ వుండే సేల్స్ ఎంత, అక్కడ వుండే సేల్స్ ఎంత అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వెళ్లి కేసీఆర్‌నో, స్టాలిన్‌నో అడుక్కుంటాడంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. రెండు వైన్ షాపులిస్తే హెరిటేజ్ మజ్జిగ అమ్మినట్లు అమ్ముతామని అడుగుతాడంటూ మాజీ మంత్రి సెటైర్లు వేశారు. జగన్ నిలువెత్తు నిప్పులాంటి వాడని ఆయన ప్రశంసించారు. 

జగన్ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే, చంద్రబాబు కుటుంబ బతుకు బయటపెడతానని హెచ్చరించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ తో పాటుగా ఓవరాక్షన్ చేస్తున్న వారందరినీ రాష్ట్రం నుండి తరిమికొడతామని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతమ్మ గురించి మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లోకేష్‌ను హెచ్చరించారు. 

పాముల్లాంటి చంద్రబాబు , లోకేష్ గురించి జగన్‌కు ముందే చెప్పానని... ఆయన పోనీలే అనబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఉత్తర కుమార ప్రగల్బాలు ఆపకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడని ఆయన హెచ్చరించారు. తనను ఏదో చేద్దామనుకొని నలుగురు ఆడవాళ్ళను తన ఇంటిపైకి పంపారని కొడాలి నాని దుయ్యబట్టారు. తాము తలచుకుంటే తండ్రి కొడుకులిద్దరిని ఇంటికి వెళ్లి కొడతామని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios