విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత యార్లగడ్డ వెంకటరావు గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చారు. గన్నవరం శాసనసభ నియోజకవర్గం వివాదంపై ఆయన స్పందించారు. గన్నవరం నియోజకవర్గంలో తనకు గ్రూపులు లేవని ఆయన స్పష్టం చేశారు. 

ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పనిచేయబోనని తాను ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చెప్పినట్లు ఆయన తెలిపారు. వంశీ తనను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారని ఆయన చెప్పారు. వంశీ వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.      

తన జన్మదిన వేడుకలు జరపకూడనది పలు గ్రామాల్లో కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని ఆయన విమర్శించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, మంత్రి ఒత్తిడి ఉందని చెబుతున్నారని ఆయన అన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. 

కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు కార్యకర్తల కోసం తాను ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.. గన్నవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన గెలిచిన వంశీ ఆ తర్వాత తన విధేయతను మార్చారు. వైసీపీకి అనుకూలంగా మారారు. అప్పటి నుంచి కూడా వైసీపీ నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. 

వంశీని యార్లగడ్డ వెంకటరావు మాత్రమే కాకుండా నియోజకవర్గంలో దుట్టా రామచందర్ రావు కూడా వ్యతిరేకిస్తున్నారు.