Asianet News TeluguAsianet News Telugu

గెలుపే అన్ని సమస్యలకు పరిష్కారం, సజ్జల వ్యాఖ్యలపై... : విజయవాడలో అనుచరులతో యార్లగడ్డ భేటీ

వారం రోజుల వ్యవధిలో  రెండో  దఫా  వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు అనుచరులతో రెండోసారి సమావేశమయ్యారు.  
 

Yarlagadda Venkat Rao Responds on Sajjala Ramakrishna Reddy  Comments lns
Author
First Published Aug 18, 2023, 2:39 PM IST

విజయవాడ:  రాజకీయాల్లో గెలుపు  అన్ని సమస్యలను  పరిష్కరిస్తుందని వైసీనీ నేత యార్లగడ్డ వెంకటరావు చెప్పారు.  కానీ, ఓటమి ప్రతి ఒక్కరిని సమస్యల వలయంలోకి నెట్టివేస్తుందని యార్లగడ్డ వెంకటరావు  అభిప్రాయపడ్డారుయార్లగడ్డ వెంకటరావు  శుక్రవారంనాడు విజయవాడలోని హోటల్ లో  తన అనుచరులతో  సమావేశమయ్యారు.  వారం రోజుల వ్యవధిలో  రెండోసారి  యార్లగడ్డ వెంకటరావు  సమావేశం కావడం  ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో  వైసీపీ బ్యానర్లు,ఫ్లెక్సీలు,  జెండాలు, సీఎం జగన్ ఫోటో కూడ లేదు.ఈ సమావేశంలో  ఆయన ప్రసంగించారు.    తనకు  అమెరికా పౌరసత్వం  లభించే అవకాశం ఉన్నా  రాజకీయాలపై  ఆసక్తితో తాను  ఇండియాకు వచ్చినట్టుగా  ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో  కొన్నింటిని  కాదనలేమన్నారు. తాను  ఎలాంటి పదవులను ఇవ్వలేకపోయినా  తన  వెన్నంటి ఉన్న అనుచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో  కోస్తా జిల్లాల నుండి కన్నా లక్ష్మీనారాయణ   15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడన్నారు. పదవి ఉన్న సమయంలో ఆయన ఇంటి వద్ద జనం ఉండేవారన్నారు.  రాజకీయ నిరాశ్రయుడైన తర్వాత  కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేత ఇంటి వద్ద పది మంది కంటే  కూడ ఎక్కువ మంది లేరన్నారు. 

ఏ పదవి ఇవ్వకున్నా అసలైన వైసీపీ నేతలంతా తనతోనే ఉన్నారని యార్లగడ్డ వెంకటరావు  గుర్తు చేశారు.తనకు తానుగా  మిమ్మల్ని  వదిలి వెళ్లబోనని  యార్లగడ్డ వెంకటరావు  చెప్పారు.తాను  రాజకీయాల్లో నూటికి 90 శాతం అవమానాలు పడేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగినన్ని అవమానాలు రాజకీయాల్లో ఎవరికి జరగలేదన్నారు. 

also read:గన్నవరం రాజకీయాలు గరం గరం: యార్లగడ్డను లైట్ తీసుకున్న వైసీపీ నాయకత్వం

గన్నవరం వచ్చినప్పటి నుండి  గెలవడమే ధ్యేయంగా పనిచేసినట్టుగా  యార్లగడ్డ వెంకటరావు చెప్పారు. పెద్దల అపాయింట్ మెంట్ వచ్చినా రాకున్నా మన బాధలు మనకుంటాయన్నారు.గత సమావేశంలో  తాను  గన్నవరం అసెంబ్లీ సీటు తనకు  ఇవ్వాలని  కోరితే పార్టీ నాయకత్వానికి ఏమి అర్థమైందో తనకు తెలియదన్నారు.  నమ్మిన వారిని  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  బాధ పెట్టడని  చాలా మంది తనకు చెప్పారన్నారు. తమపై అక్రమ కేసులుపెట్టారని  చెప్పినా కూడ ఎవరు వినడం లేదని  ఆయన  వైసీపీ నాయకత్వంపై  పరోక్షంగా  విమర్శలు చేశారు

.పార్టీలో ఉంటే ఉండూ లేకపోతే వెళ్లిపో అనే రీతిలో  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి తననుద్దేశించి వ్యాఖ్యలు చేశారని  అనుకోవడం లేదన్నారు. ఒకవేళ ఈ రకమైన వ్యాఖ్యలు చేసినట్టైతే ఆ వ్యాఖ్యలు తనకు  తీవ్ర బాధను కల్గించినట్టుగా  చెప్పారు.టీడీపీ కంచుకోటలో తన శక్తి వంచన లేకుండా  గెలుపు కోసం ప్రయత్నించినట్టుగా  యార్లగడ్డ వెంకటరావు చెప్పారు.తన బలం బలహీనత అయిందా అని ఆయన  ప్రశ్నించారు.నమ్మిన మనుషులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుందన్నారు.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios