Asianet News TeluguAsianet News Telugu

జగన్ జైలుకెళితే సీఎం అయ్యేదెవరు? వైసిపి వర్గాల్లోనే ఆసక్తికర చర్చ: యనమల సంచలనం

జైలుకెళ్తాననే భయంతోనే జగన్ రెడ్డి తప్పుమీద తప్పులు, తప్పుడు పనులు చేస్తున్నారని మాజీ మంత్రి యనమల ఆరోపించారు. 

yanamala ramakrishnudu sensational comments cases on cm jagan
Author
Guntur, First Published Oct 16, 2020, 12:32 PM IST

గుంటూరు: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నాడు... చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు జగన్ రాసిన లేఖ ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని సీనియర్ న్యాయవాదులే చెప్పారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. కాబట్టి జగన్ రెడ్డిపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఖాయమన్నారు యనమల. 

''జైలుకెళ్తాననే భయంతోనే జగన్ రెడ్డి తప్పుమీద తప్పులు, తప్పుడు పనులు చేస్తున్నారు. జైలుకు జగన్ వెళ్తాడనే చర్చ సొంత పార్టీ వైసిపి నాయకుల్లో, కార్యకర్తల్లో జరుగుతోంది. జగన్ తర్వాత సిఎం ఎవరనే ఆలోచనలు వైసిపిలో జోరుగా చేస్తున్నారు. జగన్ రెడ్డి ఆందోళన, వైసిపి కార్యకర్తల్లో చర్చలు ఈ లేఖలో ప్రతిబింబించాయి'' అన్నారు. 

''భస్మాసురుడి మార్గంలో జగన్ రెడ్డి నడుస్తున్నాడు. భస్మాసురుడి తరహాలోనే తన చెయ్యి తననెత్తిపై జగన్ రెడ్డి పెట్టుకున్నాడు. తనపై ఉన్న 31కేసులకు(సిబిఐ 11, ఈడి 7, ఇతర కేసులు13) అదనంగా మరో కేసును కూడా కొనితెచ్చుకోబోతున్నారు(కోర్టు ధిక్కరణ కేసు). శిక్షపడితే 6ఏళ్ల అనర్హత భయం జగన్ ను వెన్నాడుతోంది. పదేళ్ల శిక్ష పడితే 16ఏళ్లు పోటీకి అనర్హుడు అవుతాడు. ఈ 31కేసులతో తన రాజకీయ జీవితం ముగిసి పోతుందనేది జగన్ భయం. అందుకే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. జగన్ తప్పటడుగులు, తప్పుడు పనులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకే అవరోధాలు అయ్యాయి'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

read more   వైసిపి ఎంపీ సురేష్ ఇంటివద్ద కాపుకాసి... రాడ్ తో దాడికి యత్నం

''బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్, తమిళనాడు అడ్వకేట్స్ అసోసియేషన్, మహిళా న్యాయవాదుల సంఘం తదితర అసోసియేషన్లు అన్నీ జగన్ దుర్బుద్దిని, రహస్య అజెండాను తప్పుపట్టాయి. విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ అడ్వకేట్లు జగన్ లేఖను ఖండించారు. సిజెకు లేఖ ద్వారా జగన్ రెడ్డి రాష్ట్రానికే తలవంపులు తెచ్చాడు. దేశవ్యాప్తంగా తన అవినీతిపై మళ్లీ చర్చ పెట్టాడు. జగన్ రెడ్డి రూ43వేల కోట్ల అవినీతి, 31కేసులు, హవాలా, మనీలాండరింగ్ తదితర తీవ్ర అభియోగాలపై డిబేట్ తెచ్చాడు'' అన్నారు. 

''సిజెకు లేఖ ద్వారా జగన్ రెడ్డి సాధించింది ఏమిటి..? తన స్వార్ధానికి మొత్తం రాష్ట్రాన్నే బలి పెడుతున్నాడు.  ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ను పాలిస్తున్నాడని దేశం మొత్తం విస్తుపోయేలా చేశారు. తనను నమ్మి ఓట్లువేసిన ప్రజలను మోసం చేశారు'' అన విమర్శించారు. 

''అధికారంలో లేనప్పుడు తండ్రి అధికార అండతో... ఇప్పుడు స్వయంగా అధికారం హస్తగతమవ్వడంతో జగన్ మోసాలు, ద్రోహాలు ఎక్కువయ్యాయి. ఇప్పటిదాకా హవాలా, మనీ  లాండరింగ్ నేరాలతో రాష్ట్రానికి జగన్ చెడ్డపేరు తెస్తే, ఇప్పుడీ లేఖతో యావత్ దేశానికే తీరని కళంకం తెచ్చాడు. తన నేరాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్న ఉమ్మడి ఏపి హైకోర్టుపై జగన్ పగ పట్టాడు. అందుకు కారకులపై ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా, ఏకంగా హైకోర్టుపైనే కక్ష గట్టాడు.  న్యాయవ్యవస్థపై పగబట్టిన పాలకుడిని ఇప్పుడే చూస్తున్నాం'' అని మండిపడ్డారు. 

''హైకోర్టును, సుప్రీంకోర్టునే జగన్ టార్గెట్ చేశాడు. తద్వారా తన కేసులపై రాబోయే తీర్పులను ప్రభావితం చేయాలనే పథకం వేశాడు. ఇప్పటికే తన కేసులలో సహనిందితులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో నియమించారు. ప్రభుత్వ సీక్రెట్ డాక్యుమెంట్స్ ను కూడా వారి ద్వారా పబ్లిక్ చేయిస్తున్నారు.  సిజెకు రాసిన లేఖతోపాటు తన ప్రభుత్వ సలహాదారుతో విడుదల చేయించారు. కోర్టు ధిక్కరణతోపాటు సీక్రెట్ డాక్యుమెంట్స్ పబ్లిక్ చేసిన నేరానికి కూడా పాల్పడుతున్నారు. రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండే నైతిక అర్హతనే కోల్పోయారు'' అన్నారు. 

''ప్రభుత్వాలను కోర్టులు అస్థిర పర్చడం ఎప్పుడైనా విన్నామా, కన్నామా..? తన ప్రభుత్వాన్ని న్యాయస్థానం అస్థిర పరుస్తోందన్న ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా..? ఇంత విధ్వంస మనస్తత్వం ఉన్నవారు పరిపాలనకే తగరు. జగన్ రెడ్డి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి, ఏకంగా న్యాయవ్యవస్థనే బెదిరించే స్థాయికి చేరడం జగన్ బరితెగింపు రాజకీయాలకు పరాకాష్ట. ఇప్పటిదాకా ప్రతిపక్షాలను బెదిరించడం, శాసన వ్యవస్థను బెదిరించడం, పరిపాలనా వ్యవస్థను బెదిరించడం,అధికార యంత్రాంగాన్ని బెదిరించడం, మీడియాను బెదిరించడం, ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థనే బెదిరించడం చూస్తున్నాం. ఈ పెడధోరణులను ఇలాగే వదిలేస్తే రేపు ఎంతకైనా తెగిస్తారు'' అని ఆరోపించారు. 

''జైలుకు పోకుండా ఉండేందుకు జగన్ ఆడుతున్న గేమ్ ప్లేన్ లో భాగమే ఈ లేఖ. ఈ కేసులన్నింటిపై రోజువారీ విచారణ జరిగితే శిక్ష పడుతుందనే భయం. శిక్ష పడితే 6ఏళ్లనుంచి 16ఏళ్లు పోటీకి అనర్హత వేటు పడుతుందనే భయం. జైలు భయంతోనే జగన్ రెడ్డి బెంబేలెత్తి పోతున్నారు. పరిపాలన గాలికి వదిలేసి తన కేసులు,రోజువారీ విచారణ, రాబోయే తీర్పుల గురించి కంగారెత్తి పోతున్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట్లో ముంచేశారు, రాష్ట్ర భవిష్యత్ ను అంధకారం చేశారు'' అని యనమల మండిపడ్డాడు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios