‘‘మేజిక్ ఫిగర్ తగ్గించడానికే వైసీపీ రాజీనామా చేసింది.. చూపంతా సీఎం కుర్చీ మీదే’’

First Published 23, Jul 2018, 5:53 PM IST
yanamala ramakrishnudu fires on bjp and ycp
Highlights

వైసీపీ, జనసేనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీకి వైసీపీకి, జనసేన ఆంధ్రప్రదేశ్‌లో మూలస్థంభాలుగా నిలబడ్డాయని ఆరోపించారు

వైసీపీ, జనసేనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీకి వైసీపీకి, జనసేన ఆంధ్రప్రదేశ్‌లో మూలస్థంభాలుగా నిలబడ్డాయని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయన్నారు.. వైసీపీ, జనసేన దృష్టంతా సీఎం కుర్చీ మీదే ఉందని ఆరోపించారు. అసలు మంగళవారం రాష్ట్రబంద్‌కు ఎందుకు పిలుపునిచ్చారని యనమల వైసీపీని ప్రశ్నించారు.

ముందుగానే రాజీనామాలు చేసి వాటిని ఆమోదించుకోవడం ద్వారా లోక్‌సభలో మెజారిటీ ఫిగర్ తగ్గించి వైసీపీ.. బీజేపీకి మేలు చేసిందన్నారు.. ఆ పార్టీ నేతలు నూటికి నూరు శాతం బీజేపీతోనే ప్రయాణిస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదని రామకృష్ణుడు అన్నారు. కేంద్రప్రభుత్వం తన ఆలోచనలను రాష్ట్రాలపై రుద్దుతోందని... సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఎద్దేవా చేశారు.. ఎక్కడ లాభం వస్తే అక్కడే శ్రద్ధ చూపిస్తోందని.. జీఎస్టీ కౌన్సిల్‌ను నీరుగార్చి.. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను పక్కన పెట్టేస్తోందని ఆరోపించారు. 
 

loader