డీఎల్, సునీతాతో భేటీ: కడపలో షర్మిల వ్యూహం ఫలిస్తుందా?

 కడపపై షర్మిల ఫోకస్ పెట్టారు.స్వంత జిల్లాలోనే  సీఎం జగన్ పై  షర్మిల విమర్శలను ఎక్కు పెట్టారు.

Y.S.Sharmila Focuses on Kadapa District lns


కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కడప జిల్లాపై  కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల కేంద్రీకరించారు.  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా  వై.ఎస్. షర్మిల సోమవారంనాడు  కడప జిల్లాకు వచ్చారు. కడప జిల్లాలో  వైఎస్ఆర్‌పీని దెబ్బతీయాలనే లక్ష్యంతో  షర్మిల పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే  మాజీ మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డితో  కూడ  వై.ఎస్. షర్మిల భేటీ అయ్యారు. మాజీ మంత్రి రవీంద్రా రెడ్డిని ఆమె పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం.రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని  డీ.ఎల్.  రవీంద్రా రెడ్డి గతంలోనే ప్రకటించారు.  అయితే  ఏ పార్టీ అనే విషయాన్ని ఆయన ప్రకటించలేదు. అయితే ఇవాళ షర్మిలతో డీ.ఎల్. రవీంద్రా రెడ్డితో  భేటీ కావడంతో చర్చ సాగుతుంది.

మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి కూతురు వై.ఎస్. సునీతారెడ్డి కూడ  వై.స్.షర్మిలతో  ఇవాళ భేటీ అయ్యారు. వీరిద్దరూ  ఇడుపులపాయలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు.అనంతరం ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు.

also read:రాజమండ్రి టీడీపీ సభలో కిందపడబోయిన బాబు, కాపాడిన సెక్యూరిటీ

గత కొంత కాలంగా వై.ఎస్. సునీతా రెడ్డి లేదా ఆమె తల్లి  కడప లేదా పులివెందుల నుండి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. వైఎస్ఆర్‌సీపీకి గట్టి పట్టున్న  ఈ జిల్లా నుండే ఆ పార్టీని దెబ్బకొట్టాలనే లక్ష్యంతో  షర్మిల  అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

 వై.ఎస్. సునీతా రెడ్డి భేటీ ఇందులో భాగమేనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే  వీరిద్దరి భేటీలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయా, కుటుంబ విషయాలపై చర్చించారా  అనే విషయమై  స్పష్టత లేదు. కానీ, ఈ భేటీ రాజకీయంగా చర్చకు దారి తీసింది.

also read:సాక్షిలో జగన్ కు నాకూ సమాన వాటా: కడపలో వై.ఎస్. షర్మిల

వైఎస్ఆర్‌సీపీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు వై.ఎస్. షర్మిలతో నడుస్తారనే  ప్రచారం కూడ సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని కొందరు వైఎస్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు ఖండించిన విషయం తెలిసిందే. 

also read:నా సభ వద్ద పోలీసులే కన్పించడం లేదు: బాబు వ్యాఖ్యలకు నవ్వులు

కడపలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో  జగన్ పై  షర్మిల ఘాటుగా విమర్శలకు దిగారు. సీఎం అయ్యాక జగన్ వైఖరిలో మార్పు వచ్చిందని  ఆమె ఆరోపించారు.  వైఎస్ఆర్‌సీపీ కోసం తాను  ఎంత కష్టపడ్డానో వివరించారు. అలాంటి తనకు పదవులపై వ్యామోహం ఉందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తనపై  వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల  ఆగ్రహం వ్యక్తం చేశారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios