Asianet News TeluguAsianet News Telugu

అర్ధంకాకుండా మాట్లాడటంలో చంద్రబాబు ధిట్టే

  • ‘విభజన చట్టం అమలులో లోపాలున్నాయి కాబట్టి తామేమీ చేయలేమని కేంద్రం అంటోంది’ అని చంద్రబాబు అన్నారు.
would Naidu call off friendship with BJP

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల్లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? మంగళవారం మీడియాతో చంద్రబాబు మాట్లాడిన మాటలను బట్టి అదే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, ‘విభజన చట్టం అమలులో లోపాలున్నాయి కాబట్టి తామేమీ చేయలేమని కేంద్రం అంటోంది’ అని చంద్రబాబు అన్నారు. అదే సమయంలో ‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి ప్రత్యేకహోదాకు మద్దతు ప్రకటించారు’ అని కూడా అన్నారు. అంటే అర్ధమేంటో చంద్రబాబే చెప్పాలి.

ఏ విషయంలోనైనా అర్ధంకాకుండా మాట్లాడటంలో చంద్రబాబును మించిన రాజకీయ నేత దేశం మొత్తం మీద ఇంకోరు లేరన్న విషయం చాలా సార్లే స్పష్టమైంది. ఇపుడు కూడా అదే పద్దతిలో మాట్లాడారు. విభజన చట్టంలోని లోపాల వల్ల అమలు చేయటం సాధ్యం కాదని కేంద్రం చెప్పిందని అన్నారు. అంటే చంద్రబాబు డిమాండ్ చేస్తున్నట్లుగా విభజన చట్టం అమలు సాధ్యం కాదని కేంద్రం చెప్పేసినట్లే కదా?

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు ఇంతకాలం చెబుతున్నారు. మరి ఇపుడు చంద్రబాబేం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం నుండి పొత్తులు తెంచుకుని బయటకు వచ్చేస్తారా? అన్న విషయంలో స్పష్టత లేదు. పైగా తాను ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతుంటే సానుకూలంగా స్పందించటం లేదని కూడా చంద్రబాబే చెప్పారు. ఏపికి బిజెపి అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు కూడా.

ఇక, కాంగ్రెస్ విషయంపై మాట్లాడుతూ, అధ్యక్షుడు రాహూల్ గాంధి ప్రత్యేకహోదాకు పూర్తి మద్దతు పలికారంటూ చంద్రబబు చెప్పటం విశేషం. అంటే, రాహూల్ ప్రకటనతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ బహిరంగంగా హామీ ఇచ్చినట్లే కదా? రాష్ట్రప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ తో చంద్రబాబు కలుస్తున్నట్లు అనుకోవచ్చా? ఆ ముక్క కూడా చంద్రబాబు స్పష్టంగా చెప్పటం లేదు. పైగా రెండు జాతీయ పార్టీలు కలిసి రాష్ట్ర విభజన చేశాయని ఆరోపిస్తున్నారు. అప్పటికేదో విభజనతో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. మొత్తం మీద ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాకుండా మాట్లాడటంలో చంద్రబాబును మంచినోరు ఇంకోరు లేరని మరోసారి అర్ధమైపోయింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios