ఒంగోలు: ప్రకాశం జిల్లాలో నెల రోజుల చిన్నారి కిడ్నాప్ మిస్టరీని పోలీసులు రెండుున్నర గంటల్లోనే చేధించారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిని తల్లి చెంతకు చేర్చనున్నారు పోలీసులు.

ఇవాళ పోలేపల్లికి చెందిన మరియకుమారి నుండి గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. మాయా మాటలు చెప్పి మరియకుమారి నుండి పిల్లాడిని ఆ మహిళ కిడ్నాప్ చేసింది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రభుత్వం నుండి నిధులు వస్తాయని నమ్మించిన మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లింది. 

also read:పక్కా స్కెచ్: దర్శిలో నెల రోజుల చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ

బాధితురాలి పిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేశారు.  గుంటూరు జిల్లా ఉప్పలపాడు వద్ద మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నుండి ఆమెను ప్రకాశం జిల్లాకు తీసుకొస్తున్నారు.

మహిళలు వచ్చిన ఆటో డ్రైవర్ ను తొలుత పోలీసులు విచారించారు. ఈ మహిళ ఎక్కడికి వెళ్లిందనే విషయమై స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల సహాయంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సరిహద్దు జిల్లాలకు చెందిన పోలీసులకు కూడ సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.