వైసీపీ ఎంఎల్ఏ రోజా చేస్తున్న ఆరోపణలకు, టిడిపి నేతల వ్యవహారాలకు సరిపోయింది కదా?

తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. నంద్యాల మున్సపల్ వైస్ ఛైర్మన్ విజయకుమార్ ఉదంతమే తాజా ఉదాహరణ. జరిగిందేమిటంటే, నంద్యాల మున్సిపాలిటిలో కౌన్సిలర్లకు ఓ వాట్సప్ గ్రూపుంది. ఆ గ్రూపులో నిన్నటి రోజున ఓ వీడియో షేర్ అయింది అందరికీ. ఆ వీడియోను చూసినవారందరూ ఒకటే షాక్. ఇంతకీ అందులో ఏముందంటే, కొద్ది నిముషాల నిడివితో ఓ బ్లూఫిల్మ్ ఉందట. మిగిలిన కౌన్సిలర్ల సంగతేమో గానీ మహిళలు మాత్రం మొదట ఇబ్బంది పడ్డారు. తర్వాత మండిపడ్డారు. అదే విషయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుని దృష్టికి కూడా తీసుకెళ్ళారట. అంతేకాకుండా విజయ్ కుమార్ పై వెంటనే చట్ట పరంగా చర్యలు తీసుకోవాలంటూ ఈ రోజు పోలీస్టేషన్లో కేసు కూడా పెట్టారు. చూడాలి జిల్లా నాయకత్వ ఏం చర్యలు తసుకుంటుందో? వైసీపీ ఎంఎల్ఏ రోజా చేస్తున్న ఆరోపణలకు, టిడిపి నేతల వ్యవహారాలకు సరిపోయింద కదా?