మరి కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి... కట్టుకోబోయేవాడు అనుమానించాడని... ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పుంగనూరు ప్రాంతానికి చెందిన చిన్నప్పకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె పుష్పరాణి... తమ సమీప బంధువు గుణశేఖర్ తో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. మరి కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. కాగా... పుష్ప రాణికి మరో యువకుడితో సంబంధం ఉందని పెళ్లికి ముందే గుణశేఖర్ అనుమానించాడు.

పుష్పరాణితో సన్నిహితంగా ఉన్నాడంటూ ఓ యువకుడిని చితకబాదాడు. అంతేకాకుండా నానా రకాల మాటలతో ఆమెను గుణశేఖర్ అవమానించాడు.  ఈ విషయాన్ని తల్లికి వివరించిన పుష్ప... ఇంట్లో గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.