నెల్లూరు జిల్లలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ మహిళ మీద దాడి చేసి గొతు కోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోవూరు దళిత వాడలో జరిగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ సురేష్ ఓ మహిళపై గొంతు కోసి దాడి చేశారు. 

ఆ మహిళ షేకున్(35) గా గుర్తించారు. ఈ దాడితో మహిళ పరిస్థితి విషమంగా మారింది. దాడిని గమనించిన స్థానికులు హుటాహుటిన మహిళను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి నిందితుడు సురేస్ పరారయ్యాడు. 

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.